తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులును నియమించారు అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు అధికారిక ప్రకటన ఇవాళ చేసింది టీడీపీ. ఇటీవల ఎల్‌. రమణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా కారణంగా ఖాలీ అయిన ఆస్థానాన్ని… తాజాగా బక్కని నర్సింహులుతో భర్తీ చేశారు చంద్రబాబు. రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ నియోజక వర్గానికి నర్సింహులు టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులుగా ఆయన పనిచేశారు.

ప్రస్తుతం ఆయన తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శగా కూడా కొనసాగుతున్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం మొత్తం తెలుగు దేశం పార్టీతోనే ముడిపడి ఉంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడికి అత్యంత నమ్మకస్తుడు బక్కని నర్సింహులు.

ఈ కారణంగానే బక్కని నర్సింహులును టీటీడీపీ అధ్యక్షుడిగా నియమించారు చంద్రబాబు నాయుడు. ఈ నియామకంపై స్పందించిన బక్కని నర్సింహులు.. తెలంగాణ లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ప్రకటించారు.  పార్టీలో యువకులకు అవకాశం ఇస్తామని… చంద్రబాబు సమయాన్ని ఇస్తారని తెలిపారు.. మా పార్టీలో గెలిచిన వాళ్ళను ఎత్తుకుపోయారని… ప్రాణం ఉన్నంత వరకు టిడిపిలోనే ఉంటానని స్పష్టం చేశారు.