ప్రజా సంగ్రామ యాత్ర వేదిక మార్పు…కోడ్ అడ్డంకితోనే

-

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపుకు చేరుకుంది. ఇటీవల యాత్ర మొదలై నెల రోజులు గడిచాయి. అక్టోబర్ 2న భారీ బహిరంగ సభతో ముగించాలని బీజేపీ భావిస్తొంది. ముఖ్య అతిథిగా బీజేపీ ముఖ్యనేత స్ముతి ఇరానీ రానుంది. హుజూరాబాద్ బైపోల్ నేపథ్యంలో హూజూరాబాద్లో భారీ బహిరంగ సభతో యాత్రను ముగించాలి అనుకున్నారు. అయితే తాజాగా వేదిక హుజూరాబాద్ నుంచి హుస్నాబాద్ కు వేదిక మార్చనున్నారు. తాజగా హూజూరాబాద్ బైపోల్ కు షెడ్యూల్ విడుదలైంది. ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గం వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో ఉంది. ఎన్నికల నేపథ్యంలో ఈ జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలు

bandi-sanjay
bandi-sanjay

లోకి వచ్చింది. భారీ బహిరంగ సభలకు అనుమతి లేకపోవడంతో వేదిక మార్పు అనివార్యమైంది. దీంతో సమీపంలో ఉన్న హుస్నాబాద్ కు వేదికను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం హుస్నాబాద్ సిద్ధిపేట జిల్లాలో ఉండటం హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అనుకుని ఉండటంతో ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు వేడుక అక్కడికి మారింది.

Read more RELATED
Recommended to you

Latest news