బండి సంజయ్ పట్టించుకోవట్లేదా…?

-

ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో కొన్ని కొన్ని కీలక మార్పులు దిశగా ఇప్పుడు బీజేపీ అధిష్టానం అడుగులు వేస్తుంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చే ఆలోచనలో ఇప్పుడు కేంద్ర నాయకత్వం ఉందని సమాచారం. అయితే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలిచిన కాంగ్రెస్ పార్టీ గెలిచిన సరే తెలంగాణలో నాయకత్వాన్ని మార్చే ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నారని సమాచారం.

వాస్తవానికి దుబ్బాక ఉప ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడులో ధీమా పెరిగింది. అయితే కొన్ని కొన్ని పరిస్థితులు మాత్రం బీజేపీ ని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. అందుకే ఇప్పుడు బీజేపీ నాయకత్వానికి మార్చడానికి రెడీ అవుతున్నారని సమాచారం. త్వరలోనే బిజెపి రాష్ట్ర స్థాయి నాయకులతో సమావేశమై కొన్ని అభిప్రాయాలను కూడా తీసుకునే అవకాశం ఉంది.

అయితే నాగార్జునసాగర్ లో బీజేపీ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకు అంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత బండి సంజయ్ పెద్దగా కష్టపడలేదు అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు బీజేపీ కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్లే సూచనలు ఉన్నాయి అనేది రాజకీయ వర్గాలు అంటున్న మాట. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా తిరుపతి ఉప ఎన్నికల్లో బిజెపికి డిపాజిట్ కూడా రాకపోతే బిజెపి రాష్ట్ర నాయకత్వాన్ని కచ్చితంగా మార్చే అవకాశాలు ఉండవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news