బీసీ గణన డిమాండ్ చాలా సంవత్సరాల నుంచి ఉంటుందని తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ అన్నారు. ఈ బీసీ గణనను తక్షణమే చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్య మంత్రి కేసీఆర్ డిమాండ్ చేశాడు. బీసీ గణన విషయం లో కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తుందని ప్రశ్నించారు. ఇక నుంచి బీసీ గణన విషయంలో తెలంగాణ నుంచి టీఆర్ఎస్ పార్టీ కూడా పోరాటం చేస్తామని ప్రకటించారు. అలాగే వచ్చే శీతకాల పార్లమెంట్ సమావేశాలలో తమ పార్టీ ఎంపీలు ఉభయ సభలలో ప్రస్తావిస్తారని స్పష్టం చేశారు.
ప్రస్తుతం కులం వంటి వి లేవు అని కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వమే కుల దృవీకరణ పత్రాలు ఇస్తున్నారని గుర్తు చేశారు. ఇలాంటి రోజులలో కులం అనేవి లేవని అన్నారు. కాగ బీసీ గణన పై చిల్లర రాజకీయాలు మానుకుని దేశ వ్యాప్తం గా బీసీ గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు.