ఎన్టీఆర్ కు భారతరత్న రా(లే)దు… రెండే రెండు కారణాలు!!

-

ప్రతీ ఏటా మహానాడు జరగడం.. ఆ కార్యక్రమంలో ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేయడం సర్వసాధారణమైన విషయంగా మారిపోయాయి! నిజంగా ఎన్టీఆర్ పై ప్రస్తుతం ఉన్న టీడీపీనాయకులకు ఉన్న శ్రద్ధ ఏమిటి, గౌరవం ఏమిటి అనేది… జయంతి, వర్ధంతి నాటి మాటలను బట్టి అంచనా వేయలేం కానీ… ఎన్టీఆర్ కు భారతరత్న అనేది బాబువల్ల అయ్యే పని కాదు అనేది గట్టిగా వినిపిస్తోన్న మాట! దీనికి రెండు కారణాలు చెబుతున్నారు… ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వడం బాబుకు ఏమాత్రం ఇష్టం లేదని… ఎన్టీఆర్ కు భారతరత్న ఇస్తే ఆ అవార్డు తీసుకోవడానికి లక్ష్మీపార్వతి వెళ్లడం నందమూరి వారిలో కొందరికి అస్సలు ఇష్టం లేదని!

తెలుగు నట సింహాం.. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు.. తెలుగుజాతి కీర్తి కిరీటాలను దశదిశలా వ్యాపింప చేసిన ఘనుల్లో ఒకరు.. తెలుగుజాతి గుండెల్లో చెరగని జ్ఞాపకం.. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక.. అన్నీ కలగలిపి నందమూరి తారక రామారావు. అలాంటి విశ్వ విఖ్యాత నట సౌర్వభౌముడికి భారతరత్న అవార్డు ఇంతకాలం ఎందుకు రాలేదు! ఆయన స్థాపించిన పార్టీ అధికారంలో ఉండి కూడా.. గతంలో ఆ పార్టీ నాయకులు కేంద్రంలో చక్రాలూ గట్రా తిపామని చెప్పుకుంటున్నా… ఎన్టీఆర్ కు భారతరత్న ఎందుకు రాలేదు? ఈ ప్రశ్నకు సమాధానం పైన చెప్పుకున్న రెండు కారణాలు మినహా… మరొకటి కనిపించడం లేదు!

ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వడం బాబుకు పూర్తిగా ఇష్టం లేదనే మాటలో వాస్తవం ఉందనేది ఒక కారణం అని చెప్పుకుంటున్న తరుణంలో… బాబు కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే రోజుల్లో కూడా ఆ పార్టీ వ్యవస్థాపక అధక్షుడికి భారతరత్నకు ఎందుకు సిఫారసు చేయలేకపోయింది? దీనికి టీడీపీ నేతలు చెప్పుకునే సమాధానం… ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే ఏపి మంత్రి మండలి తీర్మానించిందని. కానీ… దీనికి కేంద్రం చెప్పే సమాధానం… భారతరత్న అవార్డు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన జాబితాలో ఎన్టీఆర్ పేరు లేదని. ఈ విషయంలో దోబూచులాట ఆడుతూ ఎన్టీఆర్ ఆత్మను క్షోభకు గురిచేస్తూ, ఆయన అభిమానులను వంచించిందీ ఎవరు అనేది బాబుకే తెలియాలి.

ఇక చంద్రబాబుని కాదని తమ తండ్రికోసమో, తమ తాతకోసమో నందమూరి వారసులకు హస్తినలో ప్రయత్నాలు చేసే శక్తి సామర్ధ్యాల సంగతి కాసేపు పక్కన పెడితే… ఎన్టీఆర్‌ కు ఒకవేల అవార్డు ప్రకటిస్తే ఆయన సతీమణి హోదాలో లక్ష్మీపార్వతి హస్తినకు వెళ్లి రాష్టప్రతి చేతుల మీదుగా భారతరత్న పురస్కారాన్ని అందుకోవాల్సి ఉంది. అది ఆమెను వ్యతిరేకించే వారికి ఏమాత్రం మింగుడుపడని అంశమే. మరణించిన వ్యక్తికి భారతరత్న ఇస్తే నిబంధనల ప్రకారం దానిని తీసుకునే అర్హత భార్యకే ఉంటుంది. దీంతో… ఒకవేళ భారతరత్న అవార్డు ఎన్టీఆర్ కు వస్తే ఢిల్లీ నుంచి పిలుపు ఆయన సతీమణి లక్ష్మీపార్వతికే వస్తుంది. ఇది నందమూరి వారసుల్లో కొంతమందికి ఏమాత్రం మింగుడుపడని అంశమే!! ఈ రెండు కారణాలే ఎన్టీఆర్ కు భారతరత్న రాకపోవడానికి ప్రధాన కారణాలు అని విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు!

ఈ విషయాలు జనాలకు తెలియదనో లేక ప్రజలకు అంత ఆలోచన ఎక్కడిదిలే అనో తెలియదు కానీ… ఎన్టీఆర్ ప్రతీ వర్ధంతికీ, జయంతికీ… ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండులు, మాహానాడుల్లో తీర్మానాలు చేసేస్తుంటారు చంద్రబాబు & కో!! పెద్దాయన ఆత్మ క్షోభిస్తుందంటే క్షోభించదా మరి!

Read more RELATED
Recommended to you

Latest news