చైనాలోని వుహాన్ సిటీలో బయటపడ్డ కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్ బారిన పడిన వాళ్ళు దాదాపు ప్రపంచ వ్యాప్తంగా మూడు లక్షలకు పైగానే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా వైరస్ వల్ల ఇటలీ దేశంలో చాలా మంది మృత్యువాత పడుతున్నారు. కారణం ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలు..ఆ దేశ పౌరులు పాటించకపోవడం. దీంతో ఆ దేశంలో ప్రస్తుతం దేశ ప్రజలు ఎవరూ ఇల్లు దాటి బయటకు రావటం లేదు. ఎవరైనా బయటకు వచ్చినా బయట ఉన్న పోలీసులు మరియు మిలటరీ వాళ్ళు వాళ్లను అరెస్టు చేసి జైలుకు తీసుకెళ్లే పరిస్థితి నెలకొంది.
ఈ తరహా కేసులు గత మూడు రోజుల్లో ఒక్కటి కూడా నమోదు కాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో చైనాకు మరో తలనొప్పి వచ్చి పడింది. అదేమిటంటే ఇతర దేశాల నుండి వస్తున్న చైనీయులకు కరోనా వైరస్ ఉండటంతో చైనాలో మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చేటట్టు ఉందని అక్కడ జాతీయ ఆరోగ్య మిషన్ ప్రకటించింది. ఈ దెబ్బతో చైనా ఆర్థిక పరిస్థితి కుదేలు అయ్యేటట్టు ఉందని అంటున్నారు ఆర్థిక నిపుణులు. అదే జరిగితే ప్రపంచ స్థాయిలో దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది అంటూ టాక్ వినపడుతోంది.