బిగ్ బ్రేకింగ్; సిబిఐకి వివేకా హత్య కేసు, హైకోర్ట్ తీర్పు…!

-

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి ఏపీ హైకోర్ట్ సంచలనం నిర్ణయం తీసుకుంది. హత్య కేసుని సిబిఐ కి అప్పగించాలని హైకోర్ట్ ఆదేశించింది. వివేకా కుటుంబం, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి వేసిన పిటీషన్ లపై హైకోర్ట్ విచారణ జరిపింది. సిట్ నివేదికను రెండు సీల్డ్ కవర్లలో హైకోర్ట్ కి ప్రభుత్వం సమర్పించింది. దీనితో ఈ కేసుని సిబిఐ టేకప్ చేయనుంది త్వరలో.

గత ఏడాది ఎన్నికలకు ముందు జరిగిన ఈ హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ హత్య కేసుని సిట్ విచారణ చేస్తుంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కేసుని సిబిఐ కి అప్పగించాలి అని డిమాండ్ వినపడింది. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఈ కేసుని సిబిఐ కి అప్పగించాలి హైకోర్ట్ లో పిటీషన్ వేసారు.

జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వివేకా కుటుంబం కూడా సిబిఐ కి కేసు అప్పగించాలని డిమాండ్ చేసింది. వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత కూడా పిటీషన్ దాఖలు చేసారు. ఇక టీడీపీ నేతలను, బిజెపి నేతలను సిట్ విచారించింది. ఇక ఈ కేసుకి సంబంధించి మరి కొందరు అనుమానితులను విచారించే అవకాశాలు ఉన్నాయి. ఏది ఎలా ఉన్నా సిబిఐ కి ఈ కేసు అప్పగించడం మాత్రం సంచలనమే.

Read more RELATED
Recommended to you

Latest news