బాబుకు బిగ్ షాక్.. జ‌గ‌న్‌కు సూపర్ ఛాన్స్?

మొత్తానికి బీజేపీకి…చంద్రబాబుపై ఉన్న కోపం తగ్గినట్లు కనిపించడం లేదు. అసలు ఆయన్ని దగ్గర చేసుకోవడానికి బీజేపీ ఏ మాత్రం ఇష్టపడటం లేదు…మరొకసారి దగ్గర చేసుకుని మోసపోలేమని తెగేసి చెప్పేస్తుంది. ఇప్పటికే చంద్రబాబు …బీజేపీకి పలుమార్లు హ్యాండ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరొక్కసారి పొత్తు పెట్టుకుని తప్పు చేయలేమని బీజేపీ చెబుతోంది. ఇదే విషయాన్ని తమ స్నేహితుడు పవన్ కల్యాణ్ కు కూడా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

టీడీపీతో పొత్తు పెట్టుకుని వైసీపీకి చెక్ పెట్టాలని పవన్ భావిస్తున్న విషయం తెలిసిందే..ఈ క్రమంలోనే పొత్తుల గురించి మూడు ఆప్షన్స్ కూడా ఇచ్చారు. కానీ బాబుతో కలవడానికి బీజేపీ మాత్రం ఒప్పుకోవడం లేదు. దీంతో పవన్…బీజేపీ నుంచి బయటకొచ్చి బాబుతో కలిసి ముందుకెళ్తారని ప్రచారం జరిగింది. కానీ ఊహించని విధంగా పవన్…తాజాగా టీడీపీతో పొత్తు ఉండదని పరోక్షంగా చెప్పేశారు.

అయితే పవన్ ఇలా చెప్పడానికి బీజేపీనే కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బాబు అవసరానికి తగ్గట్టు వాడుకుని వదిలేస్తారని, కాబట్టి ఆయనతో పొత్తు అనవసరమని, ఒకవేళ 2024 ఎన్నికల్లో జగన్ గెలిచిన ఇబ్బంది లేదని, కానీ బాబు గెలిస్తే మాత్రం తమకే నష్టం జరుగుతుందని, జనసేన – బీజేపీలని ఎదగనివ్వరని, అదే టీడీపీ ఓడిపోతే బలపడేందుకు అవకాశాలు ఉంటాయని పవన్ కు నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. బాబు కంటే వయసు అయిపోయింది కాబట్టి.. ఇంకా టీడీపీ రాజకీయంగా నిలబడలేదని, కాబట్టి 2024 ఎన్నికలు వదిలేసి 2029 ఎన్నికలని టార్గెట్ చేసుకుని ముందుకెళితే బెటర్ అని పవన్ కు బీజేపీ సూచించినట్లు తెలుస్తోంది.. అదే సమయంలో నెక్స్ట్ కేంద్రంలో కాస్త అటు ఇటు అయిన జగన్ సపోర్ట్ తీసుకోవచ్చని, అదే బాబు అయితే.. ఆయన కాంగ్రెస్ వైపుకు వెళ్ళిన వెళ్తారని బీజేపీ భావిస్తుంది. అందుకే బాబుతో పవన్ పొత్తు లేకుండా, పరోక్షంగా జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చేయాలా చేయాలనేది బీజేపీ ప్లాన్ గా ఉందని తెలుస్తోంది. మొత్తానికైతే బీజేపీ ప్లాన్ వర్కౌట్ అయితే జగన్ కు మళ్ళీ సీఎం అయ్యే ఛాన్స్ దొరికినట్లే.