డిల్లీ లో  అట్టర్ ప్లాప్ గా ఓడిపోయినా బీజేపీ ఫుల్ డాన్స్ చేస్తోంది ..!

-

ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇటీవల రిలీజైన సంగతి అందరికీ తెలిసినదే. జరిగిన ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీకి మరియు బిజెపి పార్టీకి పోటాపోటీ నువ్వానేనా అన్నట్టుగా ఎన్నికల ముందు వాతావరణం ఉంది. ఎగ్జిట్ పోల్స్ పరంగా చూసుకుంటే ఎలక్షన్ రిజల్ట్ రాకముందు ముందునుండి ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ మెజార్టీ రావడం గ్యారెంటీ అని తేలింది.

అయితే తాజాగా రిజల్ట్ వచ్చాక అదే రిపీట్ అయింది. భారీ మెజార్టీతో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడంతో కేజ్రీవాల్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఢిల్లీలో మళ్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు పట్టం కట్టడంలో ముఖ్య కారణం కేజ్రీవాల్ యొక్క పరిపాలన అని తేలింది. విద్య వైద్యం విషయంలో మరియు పొల్యూషన్ విషయంలో కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయాలు ఆమ్ ఆద్మీ పార్టీని మరొకసారి గెలిపించడం జరిగినది.

 

అయితే ఎన్నికలలో కేజ్రీవాల్ పార్టీకి భీకరమైన పోటీ ఇచ్చిన బిజెపి…అనుకున్న స్థాయిలో రాణించలేకపోయి అట్టర్ ఫ్లాప్ పార్టీ గా ఓడిపోయిన గాని బీజేపీ ఫుల్ డాన్స్ చేస్తోంది. దానికి కారణం ఏమిటంటే 2015 ఎన్నికల్లో  బీజేపీ కేవలం మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకుంది. కానీ ఈ సారి ఆ సంఖ్య పెరగటంతో ఢిల్లీలో ఉన్న బిజెపి నాయకులు వచ్చిన రిజల్ట్స్ పట్ల ఫుల్ హ్యాపీగా ఉన్నారు.    

Read more RELATED
Recommended to you

Exit mobile version