చంద్ర‌బాబును క‌నిక‌రించ‌ని బీజేపీ.. అయినా ప్ర‌య‌త్నాలు ఆప‌ట్లేదుగా

చంద్ర‌బాబు నాయుడికి బీజేపీలో ఒకప్పుడు మంచి సంబంధాలు ఉండేవి. కానీ ఎప్పుడైతే ఆయ‌న ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారో అప్ప‌టి నుంచి వైరం మొద‌లైంది. ఇక బీజేపీకి వ్య‌తిరేకంగా చంద్ర‌బాబు నాయుడు సీఎంగా ఉన్న‌ప్పుడు దేశ‌వ్యాప్తంగా ప‌ర్య‌ట‌న‌లు చేశారు. మోడీకి వ్య‌తిరేకంగా ప్ర‌చారం నిర్వ‌హించారు. అయినా ఇవేవీ ఫ‌లించ‌లేదు.

త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, ఢిల్లీ, ప‌శ్చిమ‌బెంగాల్లో బీజేపీకి వ్య‌తిరేకంగా చంద్ర‌బాబు ప్ర‌చారం చేశారు. అయినా మోడీ రెండోసారి ప్రధానమంత్రయ్యారు. ఇక రాష్ట్రంలో చంద్రబాబు పార్టీ టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఇక అప్ప‌టి నుంచి చంద్ర‌బాబు నాయుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మోడి వైపునుండి మాత్రం ఎలాంటి స్పందనా కనబడలేదు.

ఇక ఈ సారి ఎలాగైనా బీజేపీ మెప్పు పొందాల‌ని డిటిట‌ల్ మ‌హానాడు కార్య‌క్ర‌మంలో కేంద్రానికి అంశాలవారీగా మద్దతంటూ ఏకంగా తీర్మానమే చేయించారు. ఇక దీనిపైనే కమలనాథులు మండిపోతున్నారు. మోడికి చంద్రబాబు మద్దతు అవసరమే లేదంటున్నారు. త‌మ‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును బీజేపీ మళ్ళీ దగ్గరకు తీసుకోదంటూ తేల్చి చెబుతున్నారు. ఇక ఏపీ రాష్ట్ర బీజేపీ ఇన్చార్జి సునీల్ ధియోధర్ కూడా టీడీపీతో పొత్తు పెట్టుకునేది లేద‌ని తేల్చి చెప్పారు. మ‌రి భ‌విష్య‌త్‌లో అయినా చంద్ర‌బాబు ప్ర‌త‌య్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.