టీఆర్ ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పిన ఈటల

గత కొన్ని రోజులుగా తెలంగాణలో బాగా చర్చనీయాంశం అవుతున్న విషయం ఏదైనా ఉందంటే అది ఈటల గారి విషయమే. ఆరోగ్య మంత్రి నుండి తొలగింపబడ్డాక ఈటల ఏ స్టెప్ తీసుకుంటారనేది చాలా ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ విషయం ఓ కొలిక్కి వచ్చింది. అందరూ అనుకున్నట్టుగానే ఈటల రాజేందర్ టీఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేస్తానని వెల్లడించారు. అంతేకాదు, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయమై మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్, టీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్ పై ఎన్నో విమర్శలు చేసారు.

కేసీఆర్ కి నాకు ఐదేళ్ల క్రితమే గ్యాప్ వచ్చిందని, మంత్రి పదవిలో ఉన్నంత మాత్రాన బానిసగా బతకమంతే బతుకుతామా? రైతుబంధుని నేను వ్యతిరేకించలేదని, కానీ వందల ఎకరాల్లో ఉన్న వాళ్ళు సూట్ కేసుల్లో డబ్బులు పట్టుకుపోవడం కరెక్ట్ కాదని చెప్పానని, ఉద్యమంలో ఉన్నవాళ్ళందరినీ కేసీఆర్ దూరం చేసుకుంటున్నారని, ఆ తర్వాత వచ్చినవాళ్ళే గొప్ప వారయ్యారని విమర్శించారు.