మహిళను కుక్కతో పోల్చిన బిజెపి నేత…!

అధికారంలో ఉన్నామనో లేక మరొకటో తెలియదు గాని బిజెపి నేతలు చేసే వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడుతున్నారు బిజెపి నేతలు. తాజాగా బిజెపి సీనియర్ నేత ఒకరు మహిళల నెలసరి పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నెలసరి సమయంలో భర్తలకు వంట చేసే భార్యలు మరుజన్మలో ఆడకుక్కలుగా పుడతారని,

స్వామి కృష్ణస్వరూప్‌ ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేసారు. దీనిపై ఇప్పుడు మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. ఒక మహిళ ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కుక్కల ఫోటో ఒకటి షేర్ చేసి, ‘‘ఇదిగో ఈ ఇద్దరు మహిళలు ఇప్పుడు ఆడకుక్కలు అయ్యారు. వాళ్లు చేసిన పాపమెల్లా ఏమంటే… గత జన్మలో నెలసరిలో ఉండగా తమ భర్తలకు వంటచేయడమే..’’ అని ఎద్దేవా చేసారు.

దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి గోపాల్ కృష్ణ అగర్వాల్ మాట్లాడుతూ ‘‘ఈ రెండింటిలో మీరు ఎవరు?’’ అని ఆమెను ఎదురు ప్రశ్నించడంతో బాలీవుడ్ నటి స్వర భాస్కర్ మండిపడ్డారు. ‘‘బీజేపీ జాతీయ ప్రతినిధి ఓ బహిరంగ వేదికపై మహిళలను దూషిస్తున్నారు. ఇది మీరు సిగ్గుపడాల్సిన విషయం అగర్వాల్ జీ, మీ తల్లిదండ్రులు మీకు దేవుడి పేరు పెట్టారు. కనీసం ఆ పేరుకైనా విలువ ఇవ్వండని కౌంటర్ ఇచ్చారు.