బాంబు పేల్చిన తెలంగాణా బిజెపి ఎంపీ…!

బీజేపీలో చేరికలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు అదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు. కాసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు. పది మంది టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్ కు చెందిన పది మంది టీఆర్ఎస్ నాయకులు నాతో చర్చలు జరుపుతున్నారు అని ఆయన ప్రకటించారు. ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయన్నారు.

bjp
bjp

కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంపై ఆపార్టీ నాయకులే అసంతృప్తిగా ఉన్నారు అని ఆయన పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ వంద డివిజన్లు గెలవబోతోంది అని ధీమా వ్యక్తం చేసారు. మేయర్ అభ్యర్థిని ప్రకటించటానికి అధికార పార్టీ భయపడుతోందని, టీఆర్ఎస్ తమ మేయర్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత బీజేపీ మేయర్ అభ్యర్థిని ప్రకటిస్తాం అన్నారు. భయంతోనే అధికార పార్టీ రాయితీలు ప్రకటిస్తోంది అని వ్యాఖ్యలు చేసారు.