టార్గెట్ జగన్: ఇంకా కమలనాథులు ‘తగ్గేదేలే’!

ఏపీలో కమలనాథులు వర్షన్ మారింది…తెలంగాణలో మాదిరిగా అధికార పార్టీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. గతంలో కేంద్రంలో బీజేపీ, తెలంగాణలో కేసీఆర్‌ల మధ్య కాస్త సన్నిహిత సంబంధాలే ఉండేవి. దీంతో తెలంగాణలో బీజేపీ నేతలు పెద్దగా కేసీఆర్‌పై దూకుడుగా రాజకీయం చేసేవారు కాదు…కానీ గత రెండేళ్లుగా కమలం నేతలు…కేసీఆర్‌ని ఎలా టార్గెట్ చేశారో చెప్పాల్సిన పని లేదు. అలా అధికారంలో ఉన్న పార్టీని టార్గెట్ చేయడంతో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది.

jagan
jagan

అయితే ఏపీలో బీజేపీ మాత్రం అధికార పార్టీని టార్గెట్ చేసేది కాదు. ఏపీ బీజేపీ నేతలు….జగన్‌కు అనుకూలంగానే నడిచినట్లే కనిపించేవారు. ముఖ్యంగా అధ్యక్షుడు సోము వీర్రాజు లాంటి వారు జగన్‌పై పెద్దగా విమర్శలు చేసిన సందర్భం తక్కువ. ఈయన ఎంతసేపు చంద్రబాబుపైనే విమర్శలు చేసేవారు. దీంతో బీజేపీకి అనుకున్న మేర మైలేజ్ రాలేదు. ఈ క్రమంలోనే అమిత్ షా..ఇటీవల బీజేపీ నేతలకు గట్టిగా క్లాస్ తీసుకున్నారు. ఇకపై జగన్ ప్రభుత్వంపై దూకుడుగా వెళ్లాలని, అమరావతికి మద్ధతు ఇవ్వాలని, ఇలా పలు అంశాల్లో జగన్ ప్రభుత్వాని ఎండగట్టాలని సూచించారు.

దీంతో సోము వీర్రాజు దూకుడు పెంచారు. జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. అసలు ఎప్పుడూలేని విధంగా సోము…జగన్‌పై ఫైర్ అయిపోతున్నారు. ఇలా ఫైర్ అవ్వడం వెనుక ఇంకా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. సోము వీర్రాజు ఇంకా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా ఉంటే…జగన్‌కు మద్ధతుగానే ఉన్నట్లు ఉంటుంది. పైగా ఆయన అధ్యక్ష పదవికే ఎసరు వస్తుంది.

అదే సమయంలో జనసేనతో బీజేపీ పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. కానీ జనసేన పూర్తిగా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ ముందుకెళుతుంది. దీంతో బీజేపీ-జనసేనకు కాస్త గ్యాప్ వస్తుంది. పైగా జనసేన..టీడీపీతో పొత్తు పెట్టుకునే దిశగా వెళుతుందని తెలుస్తోంది. అందుకే కమలనాథులు అలెర్ట్ అయ్యారు. జనసేనకు దూరమైతే పెద్దగా ఓట్లు రావు..అందుకే ఇంకా జగన్‌పై విరుచుకుపడుతున్నారు. ఇక ఇక్కడ నుంచి తగ్గేదేలే అంటున్నారు.