గుప్పెడంతమనసు ఎపిసోడ్ 329: వసూని హాస్టల్ కి పంపే ఏర్పాట్లు స్టాట్ చేసిన జగతి  

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో వసుధార వ్యక్తిత్వం మీద మచ్చ రాకూడదని మీరనుకుంటే తనని మీ ఇంట్లోంచి పంపించేయండని రిషి అంటాడు. తనని అర్జెంట్ గా హాస్టల్ కి పంపించండి..ఏమని చెప్తారో మీ ఇష్టం.. ఈ విషయం నేను చెప్పానని తనకి తెలియకూడదంటాడు రిషి.  మరోవైపు మహేంద్ర, వసూ వస్తుంటారు. జగతి ఇదేలా సాధ్యం అంటే..సాధ్యం చేయండి మేడమ్..తను బాధపడుతుందా, మీరు బాధపడతారా అని ఆలోచించడం లేదు మేడమ్..జ్వరం తగ్గాలంటే ఇంజెక్షన్ నొప్పిని భరించాలి ఇది కూడా అంతే అని జగతితో అంటాడు రిషి. సరిగ్గా అదే  సమయానికి మహేంద్ర, వసుధార అక్కడకు వస్తారు. వాళ్లని చూసి మాట మార్చిన రిషి..మేడం స్టోరీ బోర్డ్ కరెక్షన్ చేసి ఇవ్వండని చెబుతాడు.  అందరికీ నచ్చింది కదా అని మహేంద్ర అంటే..నాకు కూడా నచ్చాలికదా డాడ్…మేడం గారికి కొన్ని సూచనలు చేశాను పాటిస్తారనే భావిస్తున్నాను..మీకు నేను చెప్పిన మార్పులు చేర్పులు అర్థమయ్యాయే అనుకుంటున్నాను అంటాడు. జగతి అర్థమయ్యాయి సార్ అంటుంది.   అక్కడినుంచి రిషీ వెళ్లిపోతాడు. మహేంద్ర నీతో కొంచెం మాట్లాడాలి అంటే..తర్వాత మాట్లాడదాం అనేసి వెళ్లిపోతాడు. వసూ.. మేడం…రిషి సర్ స్టోరీ బోర్డ్ గురించి ఏమన్నారని అడుగుతుంది. ఏదైనా కొత్త కాన్సెప్ట్ సార్ కి చెప్పారా అని అడిగితే రిషి సార్ కొత్త కాన్సెప్ట్ చెప్పారంటుంది జగతి. ఎలా ఉంది కొత్త  కాన్సెప్ట్ అని అడిగితే చాలా అద్భతంగా ఉంది వసూ అంటుంది జగతి.
ఇంకోసీన్ లో వసూ చెట్టుకింద కుర్చోని ఉంటుంది. రిషీ వచ్చి నేను మేడమ్ మాట్లాడుకున్న మాటలు విన్నావా అంటే..వసూ ఏవి సార్ అంటుంది. రిషీ మనసులో హమ్మయ్య వినలేదులే అనుకుంటాడు. ఇందాక కుంటుకుంటూ నడుస్తున్నావ్..అన్నింటినీ ఈజీగా తీసుకుంటావ్..నొప్పిగా ఉందా అని వసుధారని అడుగుతాడు రిషి. గోళీలను దాచుకున్నావ్ సరే..బ్యాగ్ లో వేసుకుని తిరగడం ఎందుకు, పుస్తకాల్లో నెమలి ఈకలు పెట్టుకుంటే చదువు వస్తుందన్నట్టు..గోళీలకు సెంటిమెంట్ ఏమైనా ఉందా అంటాడు. ఆ సౌండ్ బావుంటుందని పెట్టుకున్నా అంటుంది వసు. ఈ లోగా క్లాస్ రూమ్ లో వసుధార పడేసుకున్న గోళీలు రిషి ఇస్తాడు..వసూ జుట్టు ముడేసుకున్న టై తీసి  ఇస్తుంది. ఇంకా నయం ఈ టైని కూడా గోడకు అంటించి దానిపై డేట్ రాసి జ్ఞాపకం అనుకోలేదు..తిరిగి ఇచ్చావ్, థ్యాంక్స్ అంటాడు. ఐడియా బావుంది సర్ నాకు తట్టలేదంటుంది వసుధార. ప్రతిసారీ పడిపోతుంటావ్ కదా డాక్టర్ కి చూపించుకో అనేసి వెళ్లిపోతాడు. పడతాం లేస్తాం అవన్నీ కామన్ సార్ అంటుంది వసూ.
 రిషీ ఇంట్లో..
బొమ్మ గీసే పనిలో పడతాడు రిషి ఫ్రెండ్ గౌతమ్.  పెద్ద పెయిటింగ్ సెటప్ పెట్టావేంటని రిషి అడిగితే బొమ్మ గీస్తున్నానురా….అది చూసి నీ కళ్లు
గిర్రున తిరుగుతాయి అంటాడు. అందమైన అమ్మాయి బొమ్మ గీస్తున్నాను, బొమ్మ ఎలా ఉండాలో చెప్పు అని రిషీని అడుగుతాడు. రిషీ నీ ఆలోచనలు నీవి అంటే.. గౌతమ్ చెప్పరా అంటే..రిషీ వసుధారను ఊహించుకుంటూ చెబుతాడు. మనోడికి పోలీక చెప్పడం కూదా రాదు..గౌతమ్ నీకు పోలిక కూడా చెప్పడం రాదేంట్రా అంటాడు. అమ్మాయిల గురించి తెలియని నిన్ను అందం గురించి అడిగా చూడు నాది బుద్ధి తక్కువ అనేసి బొమ్మ గీస్తాడు గౌతమ్.  రిషి మౌత్ ఆర్గాన్ వాయిస్తుండగా…గౌతమ్ బొమ్మ గీయడం పూర్తిచేస్తాడు.
రిషి ఇచ్చిన గోళీలు  చూసి వసుధార మురిసిపోతుంది. వాటిని నెమలీకలు వేసిన కూజాలో వేసి..ఫొటోలు తీసుకుంటుంది. మరోవైపు రాత్రి నిద్రపోకుండా మెట్లపై కూర్చుని మౌత్ ఆర్గాన్ వాయించుకుంటాడు. రిషి ఇంకా పడుకోలేదా, మనసులో ఏం ఆలోచిస్తున్నాడో అని మహేంద్ర అనుకుంటాడు. గోళీలు, నెమలీకకు ఫొటో తీసి రిషికి పంపిస్తుంది వసూ. ఆ ఫొటో చూసిన రిషి.. ఫోన్ చేద్దామనుకుంటే ఏమో ఎవరు తీస్తారో అనే ఆలోచనలో పడతాడు. జగతి మేడమ్ చెప్పినపని చేస్తుందా. నేను తనకి చెప్పి కరెక్టే చేశానా అనుకుంటాడు.
మరోవైపు జగతి… రిషి మాటలు గుర్తుచేసుకుని బాధపడుతుంటుంది. వసూని ఎందుకు హాస్టల్ కి పంపించమన్నాడు..అయినా వెళ్లమని వసుకి నేనెలా చెప్పగలను.. నావల్ల అవుతుందా అని అనుకుంటుంది. ఇటు వసుధార.. ఏంటో రిషీ సార్.. పిక్ చూసి కూడా రిప్లై ఇవ్వలేదనుకుంటుంది. రిప్లైయ్ ఇస్తే మీ సొమ్మేం పోతుందంట..ఈ మాటే మెసేజ్ పెడితే..ఉన్నపలంగా వచ్చి అరిచినా అరుస్తారు..సింపుల్ గా   గుడ్ నైట్ అనే మెసేజ్ పెట్టేసి బయటకు వచ్చి చూస్తే జగతి దిగాలుగా కూర్చుని ఉండడం చూస్తుంది. ఈ టైమ్ లో నిద్రపోకుండా ఏం చేస్తున్నారు, అది ఒంటరిగా అడిగిన వసుతో…ఎప్పుడూ ఒంటరిదాన్నే కదా అని బాధపడుతుంది. ఏం అయిందని వసుధార అడుగుతుంది. ఏం కాలేదు అంటుంది జగతి. వసూ నేనొకటని చెప్తాను చేస్తావా అంటుంది. మీరు అడిగాక నేను చేయకపోవడం ఏంటి మేడమ్ అంటుంది వసూ. ప్రతిసారి నువ్వు ఊహించనవే అడుగుతా అనుకోకు అంటుంది ఎపిసోడ్ ముగుస్తుంది.
రేపటి ఎపిసోడ్
జగతి కాలేజీకి రెడీ అయి వెళ్లబోతుంది. దగ్గరకు వచ్చిన వసుధార..ఎక్కడికి అని అడుగుతుంది. కాలేజీకి వెళుతున్నా అంటే…నేను కూడా వస్తా అంటుంది వసుధార. ప్రతిరోజూ కారులో తిరగడం అలవాటైందా.. నీకు నువ్వుగా రావడం నేర్చుకో..ఆటోలా రా అని సీరియస్ గా చెబుతుంది. వసు షాక్ లో ఉండిపోతుంది. మరోవైపు జగతి వెళ్లగానే గౌతమ్-రిషి ఇంటికి వస్తారు. మేడం లేరా అని అడిగితే..కాలేజీకి వెళ్లారు సర్ అంటుంది వసుధార. నువ్వెలా వస్తావ్ రిషీ అడుగుతాడు…ఇంకా నేను సౌకర్యాలకు అలవాటు పడలేదు సార్, ఆటోలో తిరగటం నాకు అలవాటే అంటుంది వసూ. వసూ డల్ గా ఉందంటే.. తాను చెప్పిన పని జగతి మేడం మొదలు పెట్టారన్నమాట అనుకుంటాడు రిషి.