మహబూబ్నగర్ లోక్సభ నుంచి మూడుసార్లు గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు గడ్డుకాలం స్టార్ట్ అయింది.. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు స్థానిక నేతలు ముఖం చాటేస్తున్నారు.. 2009లో ఇక్కడి నుంచి కెసిఆర్ ఎంపీగా గెలుపొందారు.. 2014లో జితేందర్ రెడ్డి మరి మెజార్టీతో విన్ అయ్యారు.. అలాగే 2019లో బడా పారిశ్రామిక వేత్తగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి సైతం ఆ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు..
మహబూబ్నగర్ లోక్సభకు పోటీ చేస్తే కచ్చితంగా గెలుస్తామనే భావన ఒకప్పుడు బి ఆర్ ఎస్ నేతల్లో ఉండేదట.. ఇప్పుడు ఆ నియోజకవర్గము నుంచి పోటీ చేయాలంటేనే నేతలు భయపడుతున్నారని పార్టీలో ప్రచారం నడుస్తోంది.. మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.. ఈ ఏడింటిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. ఈ క్రమంలో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదని టిఆర్ఎస్ నేతలు భావిస్తున్నారట.. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానానికి పరిమితమైన తమ పార్టీ తరఫున పోటీ చేస్తే.. జేబులకు చిల్లు పడడం ఖాయమని.. నేతలు పోటీ చేసేందుకు వెనకడుగు వేస్తున్నారట..
రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మణ్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి వంటి నేతలు మహబూబ్నగర్ లోక్సభకు పోటీలో ఉంటారని గతంలో ప్రచారం నడిచింది. ఇప్పుడు అక్కడి నుంచి పోటీ చేసింది నేతలు ముందుకు రాకపోవడంతో గులాబీ అధిష్టానం సమాలోచనలో పడిందట.. ఈ నియోజకవర్గము నుంచి పోటీ చేసే అభ్యర్థుల కోసం వేటలో నేతలు ఉన్నారని పార్టీలో చర్చ నడుస్తోంది.. అధికారాన్ని కోల్పోయిన గులాబీ పార్టీకి ఈ వ్యవహారం తలనొప్పిగా మారిందని పార్టీ నేతలు చెబుతున్నారు..