బిగ్ బ్రేకింగ్; శాసన మండలి రద్దుకి కేబినేట్ ఆమోదం…!

-

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుకి ఆ రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. ఉదయం 9;30 నిమిషాలకు సమావేశమైన కేబినేట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లుని కేబినేట్ లో ప్రవేశపెట్టగా ఆమోదం లభించింది. దీనితో ఇప్పుడు ఈ బిల్లుని శాసన సభలో ప్రవేశ పెట్టి అక్కడ కూడా ఆమోదం పొందిన తర్వాత దానిని కేంద్రానికి పంపిస్తారు. మండలి రద్దు ఊహాగానాలను నిజం చేస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఇప్పుడు ఈ బిల్లు కేబినేట్ లో ఆమోదం పొందడంతో శాసన సభలో ఆమోదం పొందడం కూడా దాదాపు ఖాయమే. శాసనమండలి రద్దు విషయంలో ముఖ్యమంత్రి జగన్ నాలుగు రోజుల నుంచి పట్టుదలగా ఉన్నారు. వికేంద్రీకరణ బిల్లు, సిఆర్దియే రద్దు బిల్లులను మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపడంపై ఆగ్రహంగా ఉన్న ముఖ్యమంత్రి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

నాలుగు రోజుల నుంచి సీనియర్ మంత్రులు, న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులతో జగన్ సమాలోచనలు జరుపుతున్నారు. మండలి రద్దుకి తగిన మార్గాలను ఆయన అన్వేషించారు. ఇక ఈ బిల్లు పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొంది ఆ తర్వాత రాజ్యంగా సవరణ చెయ్యాల్సి ఉంటుంది. ఇక విపక్ష టీడీపీ ఇప్పుడు ఈ విషయంలో ఎం చేస్తుంది అనేది చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news