కారు Vs కమలం: తగ్గేదేలే!

-

తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి..ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తోంది..ఇదే క్రమంలో దాదాపు 18 ఏళ్ల తర్వాత బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలని హైదరాబాద్ లో నిర్వహించనుండటం…ఈ సమావేశాలకు ప్రధాని మోడీతో పాటు అమిత్ షా..పలువురు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల బీజేపీ సీఎంలు రానుండటంతో గ్రేటర్ హైదరాబాద్ కాషాయ మయం కానుంది. ఎప్పుడో 2004 జనవరిలో సమావేశాలు జరగగా, మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ లో సమావేశాలు జరుగుతున్నాయి.అయితే ఈ సమావేశాల లక్ష్యం కేవలం తెలంగాణలో అధికారం దక్కించుకోవడమే బీజేపీ టార్గెట్ గా ఉంది…పేరుకు జాతీయ కార్యవర్గ సమావేశాలు గాని…ఇది పూర్తిగా తెలంగాణలో బీజేపీ జరిపే ఓ రాజకీయ సమావేశం అని చెప్పొచ్చు. ఇప్పటికే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ గట్టిగా పోరాడుతుంది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ని గద్దె దించి అధికారం దక్కించుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలోనే మోడీ, అమిత్ షా లాంటి వారు సైతం తెలంగాణపై ఫోకస్ పెట్టారు. అందుకే హైదరాబాద్ లోనే సమావేశాలు నిర్వహిస్తున్నారు.

జులై 2వ తేదీ సాయంత్రం మోడీ హైదరాబాద్ కు రానుండగా, 3వ తేదీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు..అలాగే ఆ రోజు సాయంత్రం పరేడ్‌ గ్రౌండ్స్‌లో విజయ సంకల్ప సభలో పాల్గొంటారు. లక్షలాది మందితో ఈ సభని విజయవంతం చేయాలని బీజేపీ చూస్తుంది. అయితే మోడీ రాక సందర్భంగా కమలదళం గ్రేటర్ ని కాషాయ జెండాలతో నింపేసే ప్రయత్నాలు చేస్తుంది. ఇక బీజేపీకి ధీటుగా టీఆర్ఎస్ సైతం గ్రేటర్ లో రాజకీయం నడుపుతోంది.

ఇప్పటికే మెట్రో పిల్లర్లు, పెద్ద పెద్ద హోర్డింగులని రెంట్ కు తీసుకుని…టీఆర్ఎస్ పథకాలకు సంబంధించిన ఫ్లెక్సీలతో నింపేస్తుంది. అయితే జి‌హెచ్‌ఎం‌సి ఫైన్లు వేస్తున్న సరే బీజేపీ…ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ మోడీకి వెల్కం బ్యానర్లని పెట్టేస్తుంది. ఇలా రెండు పార్టీల మధ్య పోరు నడుస్తోంది…ఇక ఈ సమావేశాల తర్వాత రెండు పార్టీల మధ్య యుద్ధం మరింత ముదిరేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version