టీఆర్ఎస్ ఎమ్మెల్యే పై మహిళా నేత కేసు!

బెల్లంపల్లి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కు ఊహించన షాక్‌ తగిలింది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై టీఆర్‌ఎస్‌ పార్టీకే చెందినటు వంటి… మహిళా నేత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య… తనను, తన కుమారులను చంపుతానని ఫోన్‌ చేసి బెదిరించారని సంచలన ఆరోపణలు చేసింది టీఆర్‌ఎస్‌ మహిళా నేత పద్మారెడ్డి.

ఈ నేపథ్యం లోనే ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై మంచిర్యాల ఏసీపీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తనకు ఫోన్‌ చేసి బూతులు తిట్టాడని ఆరోపించిన ఆ మహిళ… తన ఇద్దరు కుమారులను, తనను చంపేస్తానని ఎమ్మెల్యే వార్నింగ్‌ ఇచ్చాడని… తమకు అతని నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు లో పేర్కొంది. ఇక ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా పిర్యాదులో ఏసీపీ దృష్టికి తీసుకెళ్లారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ లో జరుగుతుఉన్న అక్రమ నిర్మానాలపై అమెరికాలో ఉండే తర కొడుకు… మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యం లోనే ఈ బెదిరింపులు వస్తున్నాయని ఆమె పేర్కొంది. దీంతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కొత్త చిక్కుల్లో పడ్డాడు.