కేసీఆర్ వీడియో ట్వీట్ చేసిన కేంద్ర మంత్రి, ఇలాంటి లీడర్ కావాలి మనకి అంటూ…!

-

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశాలు చాలా తక్కువ. అవసరం అనుకుంటేనే మీడియాతో మాట్లాడుతారు. లేకపోతే ఎంత మంది ఎన్ని విమర్శలు చేసిన సరే ఆయన స్పందించాలి అనుకున్న సమయంలోనే స్పందిస్తూ ఉంటారు. తాజాగా కరోనా వైరస్ నేపధ్యంలో ఆయన మీడియా సమావేశాలు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. ఈ మీడియా సమావేశాల్లో ఆయన మాట్లాడే మాటలకు ఇప్పుడు దేశం ఫిదా అయిపోయింది.

తాజాగా వలస కార్మికుల గురించి ఇటీవల ఒక మీడియా సమావేశంలో ఒక వ్యాఖ్య చేసారు. దీనికి అందరూ ఫిదా అయిపోయారు. శభాష్ కెసిఆర్ అన్నారు… లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం సీఎం కేసీఆర్ ధైర్యం చెప్పారు. మీరూ మా బిడ్డలేనని తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. మీకు ఎలాంటి కష్టం రాకుండా కడుపులో పెట్టుకొని చూసుకుంటామని హామీ ఇచ్చారు.

రేషన్ కార్డు లేకున్నా ఒక్కొక్కరికి 12 కేజీల బియ్యంతో పాటు రూ. 500 ఇస్తామని, తమ వివరాలను దగ్గర్లోని పోలిస్ స్టేషన్ లేదా సర్పంచ్, మండల కార్యాలయాల్లో నమోదు చేయించుకోవాలని సూచించారు ఆయన. అందరి కడుపులను నింపుతామని, స్వస్థలాలకు వెళ్లకుండా ఇక్కడే ఉండాలని వారిని కోరారు. దీనిని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ట్వీట్ చేయగా… సిని ప్రముఖులు కూడా కెసిఆర్ లాంటి వ్యక్తి కావాలని కొనియాడారు. జాతీయ ఛానెళ్ల జర్నలిస్టులు, సినీ తారలు సోనూసూద్, మంచు లక్ష్మి, ప్రియా ఆనంద్‌, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తాజ్వాల అందరూ కేసీఆర్ ని కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news