స్కిల్ స్కామ్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబుని ఏపీ సిఐడి అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే మొదటి రోజు బాబు విచారణ పూర్తి కాగా, రెండో రోజు విచారణ మొదలైంది. చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం రెండవ రోజు సీఐడీ విచారణ ప్రారంభమైంది. ఇక రాజమండ్రి సెంట్రల్ జైలుకి చంద్రబాబు తరుపు న్యాయవాదులు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ రావు చేరుకున్నారు.
ఇక నేటితో బాబు రిమాండ్ పూర్తి కానుంది. దీంతో రిమాండ్ పొడిగిస్తారా? ఏసీబీ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై టెన్షన్ నెలకొంది. అటు క్వాష్ పిటిషన్ హైకోర్టులో కొట్టేసిన నేపథ్యంలో సుప్రీం కోర్టు గడప తొక్కారు. అటు ఏసీబీ కోర్టులో బెయిల్ కు సైతం బాబు పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో బెయిల్ ఇవ్వవద్దని అంటూ సిఐడి 185 పేజీల కౌంటర్ దాఖలు చేసింది. కేసు దర్యాప్తు వివరాలు, ఆధారాలు కౌంటర్ లో రూపోదించినట్లు తెలిసింది.
ఈ కేసులో 409, 17ఏ సెక్షన్లు వర్తిస్తాయని కౌంటర్ లో పేర్కొంది. కానీ బాబు తరుపు న్యాయవాదులు మాత్రం 17ఏ వర్తించదని వాదిస్తున్నారు. ఈ క్రమంలో బాబు బెయిల్ పిటిషన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారానేది ఉత్కంఠగా మారింది. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ.. ఐటీ ప్రొఫెషనల్స్ హైదరాబాద్ నుంచి ఏపీ కి వస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకెళ్లి చంద్రబాబుకు సంఘీభావం తెలపనున్నారు. భారీగా ఐటీ ప్రోఫెషనల్స్ హైదరాబాద్ నుంచి తరలి వస్తున్నట్టు ఏపీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో తెలంగాణ బోర్డర్ వద్ద భారీగా పోలీసుల మొహరించారు.
మొత్తానికి బాబు అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.