ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ అధినేత చంద్రబాబులో చాలా మార్పులు వచ్చాయి. జగన్‌ని నెగిటివ్ చేసి, మళ్ళీ అధికారంలోకి రావడానికి బాబు చేయని ఫీట్లు లేవు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు…ఇప్పుడు మరొక ఐదేళ్ల పాటు ప్రతిపక్ష నేత హోదా ఉండనున్నారు. ఇంతటి హోదా ఉన్న చంద్రబాబు…అధికారం కోసం చాలా కింది స్థాయికి దిగజారిపోతున్నట్లు కనిపిస్తోంది. ఆయనకు రోజురోజుకూ ఫ్రస్టేషన్ పెరిగిపోయి, ఏం చేస్తున్నారో అర్ధం కాకుండా ఉంది.
ఇక అది వర్కౌట్ కాలేదని చెప్పి..రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చారు. కానీ బంద్ పూర్తిగా విఫలమైంది. ప్రతిపక్షాలు బంద్ చేస్తే….కొంచెం అయినా జనాలు పట్టించుకునే వారు…కానీ తాజాగా టిడిపి చేసిన బంద్‌ని జనాలు ఏ మాత్రం పట్టించుకోలేదు. అటు పోలీసులు కూడా బంద్ పూర్తిగా విఫలం చేసేశారు. ఇక బంద్ విఫలం కావడంతో బాబు దీక్షకు రెడీ అయ్యారు.
టీడీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా 36 గంటల పాటు దీక్షకు కూర్చొనున్నారు. ఇక దీక్ష జనాల్లోకి వెళ్ళే అవకాశం కనిపించడం లేదు. అసలు బాబు చేసే వాటిని జనాలు ఏ మాత్రం పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. బాబు పని బాబు చేసుకుంటున్నారు..జనం పని జనం చేసుకుంటున్నారు. కాబట్టి బాబు ఎన్ని ఫీట్లు చేసిన వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. బాబు ఏం చేసినా నో యూజ్ అనే చెప్పేయొచ్చు.