ఏపీ సీఎంకు కొత్త టెన్షన్.. ఉద్యోగులు అంగీకరిస్తారా..? ఉద్యమాలకు సిద్దమవుతారా..?

-

ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు ఎవరికి ఉంటుందో.. వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు.. ఈ విషయం గత రెండు ఎన్నికల ఫలితాలు చూస్తే స్పష్టంగా అర్దమవుతోంది.. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి.. 2024 ఎన్నికల్లో అధికారం కోల్పోవడానికి వారే కారణమనేది రాజకీయ విశ్లేషకుల మాట.. అయితే.. ఇప్పుడు చంద్రబాబు విషయంలో్ ప్రభుత్వ ఉద్యోగులు సాప్ట్ గా ఉన్నారా..? సీపీఎస్ రద్దులో చంద్రబాబు వైఖరేంటి అనేది పలు సందేహాలకు కేంద్రబిందువుగా మారుతోంది..

గతంలో వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. సీపీఎస్‌ను ర‌ద్దు చేయాల‌ని ఉద్యోగులు డిమాండ్ చేశారు. దీనిని ర‌ద్దుచేయ‌లేకపోయిన జగన్ సర్కార్.. దాని స్థానంలో జీపీఎస్‌ను తీసుకువ‌చ్చింది. దీనిలో ఉద్యోగుల బేసిక్ పేపై 50 శాతం సొమ్మును పింఛ‌నుగా ఇస్తారు. వారి అనంత‌రం.. వారి పై ఆధార‌ప‌డిన వారికి 60 శాతం పింఛ‌న్ పింఛ‌నులో భాగం ఇస్తారు. దాన్ని ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకించి.. టీడీపీకి అండగా నిలిచారు..

అయితే ఇప్పుడు కేంద్రం జాతీయ పింఛ‌ను ప‌థ‌కాన్ని(ఎన్‌పీఎస్‌) తీసుకువ‌చ్చింది. దీనిని అమ‌లు చేయాల‌ని రాష్ట్రాల‌ను కూడా కోరింది. రాష్టాల్లో పరిస్థితులను బట్టి అమలు చేయొచ్చు.. లేదంటే కొత్త పథకాన్ని ఎంచుకోవచ్చు.. ఇక్కడే చంద్రబాబుకు పెన్షన్ టెన్షన్ తగులుకుందని ప్రభుత్వ వర్గాల్లో టాక్ నడుస్తోంది.. కేంద్రం అమ‌లు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన‌ పించన్ పథకం.. గత ప్రభుత్వంలో జగన్ తీసుకొచ్చిన జీపీఎస్ కు కాఫిగా ఉందట.. ఈ క్రమంలో జగన్ తీసుకొచ్చిన పెన్షన్ ను అమలు చేస్తే.. టీడీపీ ముద్ర ఎమీ ఉండదు.. పైగా దీన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించే చాన్స్ ఉంటుంది.. దీంతో చంద్రబాబు గతకొద్దిరోజులుగా తర్జనబర్జన పడుతున్నారట..

Read more RELATED
Recommended to you

Latest news