ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ.. అనేక విశ్లేషణలు అల్లుకుంటున్నాయి. ఆయన మారలేదు.. అని ఒకరంటే.. ఇంత జరిగినా.. ఆయన కళ్లు తెరవడం లేదు.. అని మరొకరు అంటున్నారు. దీంతో అసలు ఏం జరుగుతోందనే చర్చ టీడీపీలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ విస్తృతంగా సాగుతోంది. విషయంలోకి వెళ్లే.. రాజకీయంగా తనకు ఎదురు లేదని, ఉమ్మడి రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లుపైగా పాలించిన తనకు 13 జిల్లాలతో ఉన్న ఏపీ ఒక లెక్కా అనుకున్న చంద్రబాబు.. రెండో దపా కూడా అధికారంలోకి వచ్చేస్తామని అతి విశ్వాసం పెట్టుకున్నారు.
తమ్ముళ్లు తప్పుచేసినా.. లైట్ తీసుకున్నారు. అన్నింటినీ హెచ్చరిస్తూనే కాలం గడిపేశారు. అదేసమయం లో వైసీపీ నేతలపైనా.. ముఖ్యంగా జగన్‌పైనా .. ఆయన రౌడీలు, అరాచక శక్తులు.. కడప ఫ్యాక్షనిస్టులు అంటూ అధికారంలో ఉండగా వ్యాఖ్యానించారు. తన పార్టీ నాయకులతోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేయించా రు. ఎన్నికలకు ముందు అంటే.. ఇలాంటి వ్యాఖ్యలు ఏదో ప్రజల్లో బావోద్వేగం పెంచాలనే ఉద్దేశంతో చేసి ఉంటారని, రాజకీయంగా ఇవన్నీ కామన్ అనీ అందరూ సరిపెట్టుకున్నారు. సర్తి చెప్పుకొన్నారు. అయితే, ఎన్నికలు ముగిసిపోయి నాలుగు మాసాలు పూర్తి అయ్యాయి.
ప్రభుత్వం రిమ్ ఝిమ్.. అంటూ పాలన సాగిస్తోంది. అత్యధిక సీట్లతో కనీవినీ ఎవరుగని ఓటు బ్యాంకును సొంతం చేసుకుని జగన్.. తనదైన నూతన పంథాతో ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సమయం లో చంద్రబాబు ఇంకా గతంలోనే ఉన్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తనకు తాను ఇంకా సీఎంనేననే భావనలో ఆయన ఉంటున్నారని టీడీపీలో ని ఓ వర్గం నుంచి వినిపిస్తున్న వ్యాఖ్యలు. ఇప్పటి కీ కూడా ఇంకా జగన్‌ను పులివెందుల రౌడీలు, కడప అరాచకం.. ఆబోతులు.. అంటూ చేస్తున్న వ్యాఖ్యలు చంద్రబాబు స్థాయిని తానే దిగజార్చుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ఎన్నికలకు ముందు రాజకీయం వేరు.. ఇప్పుడు పార్టీని, తనను తాను నిలబెట్టుకునేందుకు.. ప్రయత్నించాల్సిన నాయకుడు ఇప్పుడు కూడా ఇంకా.. ఇలాంటి వ్యాఖ్యలే చేస్తూ.. పార్టీపై ఏహ్య భావం పెరిగేలా చేస్తున్నారనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తుండడం, బాబు ఇక మారరు! అనే పరిస్థితి తీసుకురావడంతో సీనియర్లు సైతం నొచ్చుకుంటున్నారు. మరి బాబు మారతారా? జగన్‌పై విమర్శలు చేయడం ఆచితూచి వ్యవహరిస్తారా? లేదా? అనేది చూడాల్సి ఉంది.