మంత్రుల‌కు చంద్ర‌బాబు టాస్క్‌.. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పైనే దృష్టి

-

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఇంత‌కుముందు కంటే కాస్త భిన్నంగా ప‌రిపాల‌న సాగిస్తున్నారు. ఇప్ప‌టికే 50 రోజుల పాల‌న‌లో కొన్ని కీల‌క మార్పుల‌ను తీసుకువ‌చ్చిన చంద్ర‌బాబునాయుడు మ‌రోసారి ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణుల కోసం ఎన్టీఆర్ భవన్‌‌లో నిత్యం మంత్రులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.ఈ మేరకు వారికి విధులు కేటాయిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇప్పటికే జులై నెలలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రులు, కీలక నేతలకు షిఫ్ట్ వేసి మరీ అందుబాటులో ఉండేలా చేశారు. ఇక ఇదే సమయంలో తాజాగా మరోమారు చంద్రబాబు మంత్రులకు షిఫ్ట్ లు వేశారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండనున్న రాష్ట్ర మంత్రలు మరియు టీడీపీ జాతీయ నాయకుల వివరాలు ఇలా ఉన్నాయి. ఆగస్ట్ 2న మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరియు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ అందుబాటులో ఉంటారు. ఆగస్ట్ 3వ తేదీన టీడీపీ అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ అందుబాటులో ఉంటారు. ఆగస్ట్ 5న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జాతీయ ఉపాధ్యక్షులు బొల్లినేని రామారావు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. ఆగస్ట్ 6న మంత్రి వంగలపూడి అనిత మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర పార్టీ కార్యాలయంలో ఉండనున్నారు. ఆగస్ట్ 8న మంత్రి పొంగూరు నారాయణ మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహార్ టీడీపీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉంటారు.

ఆగస్టులో రెండు సార్లు పార్టీ ఆఫీసులో చంద్రబాబు అందుబాటులో ఉండనున్నారు. ఆగస్ట్ 9న మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మరియు జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల సూర్య ప్రకాష్ , ఆగస్టు 10న మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ అందుబాటులో ఉంటారు. ఆగస్ట్ 11న మళ్ళీ సీఎం నారా చంద్రబాబు నాయుడు , రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ అందుబాటులో ఉంటారు. ఆగస్ట్ 12న మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అందుబాటులో ఉండ‌నున్నారు.ఆగస్ట్ 13న మంత్రి టీ.జీ. భరత్ , జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి అందుబాటులో ఉంటారు. ఆగస్ట్ 14 న మంత్రి డా. డోలా బాలవీరాంజనేయ స్వామి, జాతీయ ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి అందుబాటులో ఉండనున్నారు.ఈ మేర‌కు మంత్రుల‌కు ఆయ‌న స్ప‌ష్ట‌మైన ఆదేశాలిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news