IPL: ఐపీఎల్ గ్రేటెస్ట్ కెప్టెన్ అతనే !

-

ప్రపంచంలోనే అత్యధిక ప్రేక్షకాదరన పోందిన టోర్నమెంట్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. అంతటి ప్రజాదరణ పొందిన ఐపీఎల్ లో అన్ని సీజన్లలో కలిపి గ్రేటెస్ట్ కెప్టెన్ ఎవరు అనే ప్రశ్న ఫ్యాన్స్ లో  మొదలైంది.క్రిక్ క్రాకర్ అనే ట్విట్టర్ పేజీలో ఐపీఎల్ గ్రేటెస్ట్ కెప్టెన్ ఎవరనే పోటీ నిర్వహించారు.

కాగా, ఈ పోల్ మొత్తం 8 మంది కెప్టెన్లు అయిన.. ధోని, రోహిత్, గంభీర్, విరాట్ కోహ్లీ,షేన్ వార్న్,  వార్నర్,  గిల్‌క్రిస్ట్, విలిమమ్‌సన్ పోటీలో ఉన్నారు.  ఈ పోల్ లో ఆయా కెప్టెన్లకు వచ్చిన కామెంట్లను ఆధారంగా చేసుకుని ఒక్కొక్కరిని తొలగిస్తూ వచ్చారు. ఈ పోటీలో చివరికి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మలు ఫైనల్ రేసులో నిలిచారు. కాగా చివరకు రోహిత్ శర్మనే ఐపీఎల్ గ్రేటెస్ట్ కెప్టెన్ గా నిలిచాడు. కాగా ఈ పోటీలో నిలిచిన కెప్టెన్లలో రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని ఐదు సార్లు తమ జట్లకు కప్ సాధించారు.

Read more RELATED
Recommended to you

Latest news