రాళ్ళదాడిపై బాబు సీరియస్..కేంద్రానికి ఫిర్యాదు..ఎన్‌ఎస్‌జి ఎంట్రీ.!

-

చంద్రబాబు పర్యటనలో రాళ్ళ దాడి జరగడం కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా యర్రగొండపాలెం లో చంద్రబాబు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఇదే క్రమంలో బాబుకు వ్యతిరేకంగా మంత్రి ఆదిమూలపు సురేష్..తన అనుచరులతో కలిసి నిరసన  తెలియజేశారు. అసలు సందర్భం లేకుండా దళిత కార్డు వాడుతూ..గో బ్యాక్ అని నినాదాలు చేశారు.

అయితే పోలీసులు కూడా బాబు రోడ్ షో జరిగే ప్లేస్‌కు వైసీపీ శ్రేణులని వదిలేశారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు..బాబు కాన్వాయ్ పై రాళ్ళు విసిరారు. దీంతో బాబు సెక్యూరిటీగా ఉన్న ఎన్‌ఎస్‌జి సెక్యూరిటీ ఆఫీసర్ తలకు గాయమైంది. ఆ దెబ్బతో సీన్ మొత్తం రివర్స్ అయింది. వైసీపీకి రివర్స్ అయింది. ఎన్‌ఎస్‌జి ఆఫీసర్‌కు గాయం కావడంపై.. హెడ్ క్వార్టర్స్ ఆరా తీసింది. తలపై గాయం కావడంతో కమాండెంట్‌ను అధికారులు స్కానింగ్‌కు పంపించారు.

May be an image of 8 people

ఇటు ఈ అంశాన్ని టి‌డి‌పి కూడా సీరియస్ గా తీసుకుంది..ఇప్పటికే దీనిపై మెయిల్ ద్వారా ఏపీ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే స్థానికంగా యర్రగొండపాలెం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ఇక ప్రకాశం ఎస్పీకి కూడా టి‌డి‌పి నేతలు ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని ఇంతటితో వదలకుండా కేంద్రానికి కూడా ఫిర్యాదు చేయాలని టి‌డి‌పి నేతలు ఫిక్స్ అయ్యారు. అదే సమయంలో వైసీపీ పాలనలో దళితులపై జరిగిన దాడులు, అన్యాయాలు, హత్యలపై పోరాటం చేయాలని చంద్రబాబు ఫిక్స్ అయ్యారు.

టి‌డి‌పి దళిత నేతలు దీనిపై రంగంలోకి దిగుతున్నారు..దళిత కార్డు వాడుకుని రాజకీయం చేస్తున్న వైసీపీ వ్యూహాలకు చెక్ పెట్టాలని టి‌డి‌పి శ్రేణులు అంటున్నాయి. చూడాలి మరి దళిత కార్డుపై రెండు పార్టీలు ఏ విధంగా రాజకీయం చేస్తాయో.

Read more RELATED
Recommended to you

Latest news