అటు అసెంబ్లీలోను, ఇటు బయట కూడా టీడీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై పబ్లి క్‌లో ప్రత్యేకంగా చర్చ సాగుతోంది. చంద్రబాబు వైఖరి గతానికి మరింత భిన్నంగా ఉండడం, తాను పాతికేళ్ల యువకుడినని చెప్పు కో వడం, అధికారులపై రుసరుసలాడడం, తీవ్ర అసహనంతో ఊగిపోవడం వంటివి గడిచిన నాలుగు రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యక్షంగా చూసిన వారు, పరోక్షంగా వాటిని టీవీల్లో వీక్షించిన వారు కూడా తీవ్ర విమర్శలు చేసే పరిస్థితి వస్తోంది.
పార్టీ ఈ ఏడా ది జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుంది. అయితే, దీని నుంచి బయటపడినా..కూడా ఎక్కడో అధికారం కోల్పో యామనే ఆవేదనను మాత్రం చంద్రబాబు కంట్రోల్ చేసుకోలేక పోతున్నారు. అదేసమయంలో సహజంగానే ప్రభుత్వ పక్షం ఎమ్మెల్యేల నుంచి వస్తున్న విమర్శలు, ఈ క్రమంలో టీడీపీ వాటిని ధీటుగా ఎదు ర్కొనలేక పోతోందనే ఆవేదన కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబులో ఆవేదన, మరోపక్క ఆందోళన కూడా కట్టలు తెగుతోంది.
పార్టీని నడపడంలోనూ ఆయన తడబడుతున్నారు. తన పార్టీలో గెలిచిన వారిలో కనీసం పట్టుమని 15 మంది కూడా సభకు హాజరు కావడంలేదు. తన మాటకు విలువ కూడా ఇవ్వడంలేదు. ఇక, గెలిచిన నాయకుడు, ఒకరు వైసీపీకి జై కొట్టి, పార్టీకి రిజైన్ చేసి వచ్చి మరీ తమ పక్కనే కూర్చుంటున్నారు. ఈ పరిణామాలతో చంద్రబాబు రగిలిపోతున్నారు. దీంతో ఆయన తనను తాను కంట్రోల్ చేసుకోవడంలోను, తన వ్యాఖ్యలను నియంత్రించుకోవడంలోను కూడా ఒకింత గీత దాటుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ప్రధానంగా సీఎం జగన్‌ను చంద్రబాబు ఉన్మాది అని సంబోధించడం మరింత వివాదానికి దారితీసింది. అదేసమయంలో సభలో నూ వివిధ పత్రికల క్లిప్పుల ఆధారంగా ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని చూడడం, దీనిని అధికార పక్షం తీవ్రంగా నిరసిం చడంతో బాబు ఒకింత ఒత్తిడి కి గురవుతున్నారు. గడిచిన ఆరు మాసాల జగన్ పాలనలో పెద్దగా చెప్పుకోదగ్గ అవినీతి కానీ, విధాన పరమైన లోపాలు కానీలేవు. ఇసుక విషయంలో టార్గెట్ చేయాలని చూసినా.. ప్రభుత్వ పక్షం అవకాశం ఇవ్వలేదు. దీనికి ప్రతిగా దీటుగా సమాధానం వస్తోంది.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబులో అసహనం పెరిగిపోతోంది. దీంతో ఆయన అటు సభలోను, బయట కూడా చేస్తున్న విమర్శలు సృతి మించుతున్నాయి. ఈ పరిణామం.. అటు పార్టీకి, ఇటు ఆయనకు కూడా మంచి ది కాదని సూచిస్తున్నారు పరిశీలకులు. మరి చంద్రబాబు ఇప్పటికైనా తనది పైచేయి అని నిరూపించుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.