చిత్తూరు జిల్లా చంద్రగిరి….టిడిపి అధినేత చంద్రబాబు పుట్టిన గడ్డ. అసలు చంద్రబాబు రాజకీయ జీవితం మొదలైందే ఈ నియోజకవర్గం నుంచి. 1978లో చంద్రబాబు, కాంగ్రెస్ నుంచి చంద్రగిరిలో పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 1983లో చంద్రబాబు మళ్ళీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి టిడిపి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత చంద్రబాబు టిడిపిలోకి వెళ్ళడం, కుప్పం నుంచి పోటీ చేయడం లాంటి పరిణామాలు అందరికీ తెలిసిందే.
అంటే అంతలా చంద్రగిరిపై చెవిరెడ్డి పట్టు సాధించారని చెప్పొచ్చు. అసలు ఎమ్మెల్యేగా చెవిరెడ్డి అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారని తెలుస్తోంది. నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్న పరిష్కరించడంలో ముందుంటున్నారు. కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలబడ్డారు. అలాగే ప్రభుత్వ పథకాలని పార్టీలకు అతీతంగా అందిస్తున్నారు.
అటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగానే చేయిస్తున్నారు. ఇలా ఎమ్మెల్యేగా మంచిగా కార్యక్రమాలు చేస్తూ, ప్రజల మన్ననలు పొందుతున్నారు. అసలు అధికార వైసీపీలో టాప్ టెన్ ఎమ్మెల్యేల్లో చెవిరెడ్డి ఖచ్చితంగా ముందుంటారని చెప్పొచ్చు. అలాగే ఇటీవల వచ్చిన కొన్ని సర్వేల్లో కూడా చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి టాప్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ సర్వేలో కూడా చెవిరెడ్డి టాప్‌లో ఉన్నారని తెలిసింది. ఇలా టాప్‌లో చెవిరెడ్డి, నెక్స్ట్ ఎన్నికల్లో కూడా చంద్రగిరిలో గెలవడం ఖాయంనే తెలుస్తోది.