దాతల పేర్లు బయటపెట్టరెందుకు… పీఎమ్ కేర్స్ విరాళాలపై చిదంబరం సూటి ప్రశ్న..

-

జీడీపీ పడిపోవడం వెనక తమ అలసత్వం ఉందని, దానికి కరోనా కారణం అంటూ దేవుడిపై నెట్టివేస్తున్నారని ఆర్థికమంత్రిపై విమర్శలు గుప్పించిన మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం మరోసారి తనదైన మాటలతో ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు వేసారు. అకస్మాత్తుగా వచ్చిన కరోనా పరిణామం నుండి దేశాన్ని కాపాడుకోవడానికి పీఎమ్ కేర్స్ ఫండ్ ని స్థాపించిన ప్రభుత్వం ప్రజల నుండి విరాళాలని కోరింది. ప్రధాని మోదీ పిలుపు మేరకు పీఎమ్ కేర్స్ ఫండ్ కి వెల్లువలా విరాళాలు వచ్చి పడ్డాయి.

పీఎమ్ కేర్స్ మొదలు పెట్టిన ఐదు రోజుల్లోనే 3067కోట్ల విరాళాలు వచ్చి పడ్డాయి. ఈ మేరకు ఈ విషయాన్ని పీఎమ్ కేర్స్ అకౌంట్స్ విభాగం తెలియజేసింది. ఐతే విరాళాలు వచ్చి పడ్డాయని చెప్పినప్పటికీ అవి పంపిన దాతల పేర్లు ఎందుకు బయటపెట్టలేదని చిదంబరం ప్రశ్నించారు. దేశంలో ఏదైనా ఎన్జీఓ లేదా ట్రస్ట్ దాని పరిమితికి మించి విరాళాలు పొందినట్లయితే దాతల వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. మరి పీఎమ్ కేర్స్ ఆ ట్రస్టీనీ అందులో నుండి ఎందుకు మినహాయించారని అన్నారు.

మార్చ్ 28వ తేదీన ప్రారంభించబడిన పీఎమ్ కేర్స్ ఫండ్ కి మార్చ్ 26వ తేదీ నుండి 31వ తేదీలోగా 3067కోట్ల రూపాయలు విరాళంగా వచ్చాయి. అందులో 39.67 లక్షలు విదేశీ విరాళాలుగా వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news