ఆదిపురుష్: ప్రభాస్ నుండి మరో సర్పైజ్ వచ్చేస్తోంది..

ప్రభాస్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. నేషనల్ స్టార్ అయ్యాక మరింత స్పీడు పెంచి వరుసపెట్టి సినిమాలు ఒప్పుకుంటున్నాడు. రాధాక్రిష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రాధేశ్యామ్ తో పాటు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సైంటిఫిక్ డ్రామా.. ఇంకా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న ఆదిపురుష్.. ఈ మూడు చిత్రాలు ప్రభాస్ అభిమానుల్లో బాగా ఆసక్తిని కలిగిస్తున్నాయి.

ఐతే అన్నింటికంటే ఆదిపురుష్ పై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. దానికి కారణం, ఆదిపురుష్ రామాయణ ఇతిహాసగాథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఐతే ఈ సినిమా నుండి మరో సర్ప్రైజ్ రానుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ప్రభాస్ అందరినీ వెయిట్ చేసేలా చేస్తున్నాడు. ఏడువేల సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే అత్యంత తెలివిగల రాక్షసుడిని పరిచయం చేయవబోతున్నాడు. రేపు ఉదయం 7గంటల 11నిమిషాలకి అదేంటో రివీల్ చేయబోతున్నాడు.