‘వండర్ డ్రగ్’ రాబోతోందా ? చైనా ని కాపడింది ఇదేనా ?

-

మొన్నటి వరకు ఉరుకులు పరుగులు కలిగిన ప్రపంచంలో మరణ కేకలు పుట్టించింది కరోనా వైరస్. పేదవాడి నుండి ప్రైమ్ మినిస్టర్ వరకు ఆ దేశం ఈ దేశం అని తేడా లేకుండా చాలా మందిని బలితీసుకుంది. ప్రపంచంలోనే అగ్రదేశం రాజ్యం అని చెప్పుకునే అమెరికా ని అయితే అతలాకుతలం చేస్తోంది. ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపించే వైరస్ కావటంతో ప్రపంచంలో ఉన్న చాలా దేశాల ప్రభుత్వాలు ప్రజల ఇంటికే పరిమితం కావాలని పిలుపునిచ్చారు. దీంతో చాలా చోట్ల  లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. ఇదిలా ఉండగా చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ప్రారంభంలో చైనా ని వణికించింది. అయితే ప్రస్తుతం చైనాలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. దానికి కారణం వండర్ డ్రగ్ అనే మందు ఉపయోగించి చైనా దేశానికి చెందిన కరోనా వైరస్ బాధితులకి ఉపయోగించడంతో ప్రస్తుతం ఆ దేశంలో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు, చైనా ని కాపాడింది ‘వండర్ డ్రగ్’ అనే మందు అన్నట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి.

 

అయితే ఇది చైనా దేశానికి ఎలా  వచ్చిందో ఒకసారి గమనిస్తే…ప్రపంచ దేశాలకు డాక్టర్లను పంపించే దేశంగా వైద్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినా దేశంగా పేరొందిన క్యూబా ఈ వండర్ డ్రగ్ ద్వారా చైనా దేశాన్ని కాపాడినట్లు సమాచారం. రెండు కమ్యూనిస్టులు దేశం కాబట్టి మంచి సంబంధాలు ఉండటం తో ఈ మందును ఉపయోగించుకుని చైనా ప్రభుత్వం…కరోనా వైరస్ నీ బాగా అరికట్టడం జరిగిందని సమాచారం. ప్రస్తుతం క్యూబా ఈ మందుని 15 దేశాలకు ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

 

Read more RELATED
Recommended to you

Latest news