గెలిచిన తర్వాత కూడా సిఎంని వదలని ఎంపీ

2020 లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డియే కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు, ఎంపీ చిరాగ్ పాస్వాన్ బుధవారం ప్రధాని నరేంద్ర మోడీని అభినందించారు. బీహార్ సిఎం నితీష్ కుమార్ గెలిచినది ప్రధాని మోడీ వల్ల మాత్రమే అని అన్నారు. ఆయన మాట్లాడుతూ బీహార్‌లోని ఓటర్లు ప్రధాని మోడీపై విశ్వాసం వ్యక్తం చేశారని అన్నాడు.

రాష్ట్రంలో అభివృద్ధిని సాధించాలంటే బీహార్‌ లో బిజెపి బలపడాల్సిన అవసరం ఉందని అన్నారు. విలేకరుల సమావేశంలో చిరాగ్ పాస్వాన్ మాట్లాడుతూ, క్లిష్ట పరిస్థితుల్లో ఎల్జెపి కఠినమైన పోరాటం ఇచ్చిందని అన్నారు. “మాకు ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని అన్నారు. 2025 ఎన్నికలలో మేము కచ్చితంగా సత్తా చాటే విధంగా బలం పెంచుకుంటామని ఆయన అన్నారు.