వింత దొంగతనం.. రిస్క్ చేసి మరీ పూల కుండీలు కొట్టేసింది !

కుక్క పిల్ల సబ్బు బిళ్ళ అగ్గిపుల్ల కాదేదీ కవిత్వానికి అనర్హం అన్నాడో మహాకవి. మరి ఆయన మాటల్ని సీరియస్ గా తీసుకుందో ఏమోగానీ ఒక మహిళ చేసిన దొంగతనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే సదరు మహిళ దొంగతనం చేసేది విలువైన వస్తువులు అనుకుంటే మీరు పొరబడినట్లే ఆమె దొంగతనం చేసే వస్తువు గురించి వింటే ఆశ్చర్యం కలగక మానదు. మనం ఇప్పటి దాకా డబ్బు, బంగారం, వస్తులువు ఎత్తుకుపోయిన దొంగల్ని చూశాం… పూల మొక్కల్ని మాయం చేసిన దొంగోళ్ల గురించి విన్నారా?

ఆశ్చర్యంగా ఉన్నా. ఇది నిజం. హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన దొంగతనం ముక్కున వేలేసుకునేలా చేసింది. బల్కంపేటలో ఓ మహిళ తెల్లవారుజామున మూడున్నగంటల సమయంలో ఇంటి ముందు ఉన్న పూల కుండీలను దొంగిలించుకుపోయింది. ఇదే ప్రాంతంలోని చాలా ఇళ్ల ముందు కుండీలు మాయం అవుతుండడంతో అనుమానం వచ్చి సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తే… మహిళ వాటిని ఎత్తుకెళ్లినట్టు తేలింది. దీంతో ఆశ్చర్యపోయిన యజమానులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.