రాజకీయాలకు పవన్ కల్యాణ్ పర్ఫెక్ట్ : చిరంజీవి

-

పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణంపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు తగిన వ్యక్తి అని చెప్పారు. ప్రజల కోసం తాను చాలా కష్టపడుతున్నాడని అన్నారు. పవన్ కు వ్యక్తిగతంగా తన మద్దతు ఉంటుందని చెప్పారు. ఏదో రోజు తన తమ్ముడిని రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో చూస్తానని ధీమా వ్యక్తం చేశారు.

రాజకీయాల్లో రాణించడం చాలా కష్టమని సినీ నటుడు మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. ఒక దశలో తనకు ఈ రాజకీయాలు అవసరమా అనిపించిందని తెలిపారు. వైఎన్‌ఎం కళాశాలలో పూర్వ విద్యార్థుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.

‘‘రాజకీయాల్లో చాలా మొరటుగా, కటువుగా ఉండాలి. ఒకరితో మాటలు పడాలి.. తిరిగి వాళ్లని అనాలి. రాజకీయాలకు పవన్‌ కల్యాణ్ తగినవాడు. ఏదో ఒకరోజు పవన్‌ను ఉన్నతస్థాయిలో చూస్తాం’’ అని చిరంజీవి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news