బాలయ్య ఫాన్స్ వర్సెస్ జూనియర్ ఫాన్స్ మరోసారి…!

-

ఒక పక్క తెలుగుదేశం పార్టీకి బలం పెరగాల్సిన తరుణంలో టీడీపీలో వర్గ విభేదాలు బయటకు వస్తున్నాయి. రాజకీయంగా ఎదగాల్సిన సమాయంలో కొందరు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. పార్టీని ఒకరు నాశనం చేస్తున్నారు అంటే ఒకరు నాశనం చేస్తున్నారు అంటూ…

ఒకరిపై ఒక విమర్శలు చేసుకోవడం అవి తీవ్ర రూపం దాల్చడం వంటివి జరుగుతున్నాయి. పార్టీ నుంచి కీలక నేత కదిరి బాబూరావు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయనకు పార్టీలో అంత ప్రాధాన్యత లేకపోయినా కీలక నేత అంటూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం ఆయన బాలకృష్ణ స్నేహితుడు కావడం. గత ఎన్నికలలో బాబూరావు కి ఎమ్మెల్యే సీటు రావడం వెనుక బాలకృష్ణ ఉన్నారు.

కాని అనూహ్యంగా ఆయన పార్టీ మారడంతో బాలకృష్ణ పంపించారు అని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. నమ్మకమైన స్నేహితుడు పార్టీ మారారు అంటే కచ్చితంగా బాలకృష్ణ హ్యాండ్ ఉండవచ్చు అనడంతో ఇప్పుడు బాలకృష్ణ ఫాన్స్ ఫైర్ అయి చరిత్ర బయటకు లాగుతున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మంత్రి కొడాలి నానీ వంటి వారు టీడీపీని వీడటానికి కారణం ఎన్టీఆర్ కదా అంటున్నారు.

వాళ్ళు ఆయన మంచి స్నేహితులని అలాంటి వారు పార్టీ మారారు అంటే కచ్చితంగా మీ హస్తం ఉండకుండా ఉంటుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలా కదిరి పార్టీ మారడం ఏమో గాని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మాత్రం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అంతిమంగా వీరి మధ్య ఉన్న పోరు పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. దీనిపై కార్యకర్తలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news