మహిళల, చిన్న పిల్లల రక్షణ కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం దిశ చట్టం. ఈ క్రమంలోనే తాజాగా దిశ పేరుతో పోలీస్ స్టేషన్లకు శ్రీకారం చుట్టింది. తొలి పీఎస్‌ను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఏర్పాటు చేయగా.. సీఎం జగన్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, పలువురు మహిళా మంత్రులు, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. 24 గంటల పాటు దిశ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉండనుంది.
దిశ చట్టానికి సంబంధించి ప్రత్యేక యాప్ ను జగన్ ప్రారంభించనున్నారు. కాగా, మహిళల భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశ మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో 52 మంది సిబ్బంది పని చేస్తారు. దిశ చట్టం ఫై అవగాహనా కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్ ఇద్దరు ప్రత్యేక మహిళా అధికారులని నియమించిన సంగతి అందరికి తెలిసిందే. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ నిర్ణయం కార్య రూపం దాల్చడం తో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.