రేవంత్ రెడ్డికి కేసీఆర్ షాకింగ్ ట్విస్ట్‌.. ఇరుక్కున్న కాంగ్రెస్ ఎంపీ

-

రేవంత్‌రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్‌. నోరు విప్పితే.. తెలంగాణ సీఎం, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్ర‌స్తాయిలో విమ‌ర్శ‌లు చేసే రేవంత్ ఇప్పుడు గ‌ట్టి ఉచ్చుల్లో ప‌డ్డారు. ప‌క్కాగా ప్ర‌భుత్వం ఆయ‌న‌ను బుక్ చేసింది. అక్ర‌మ ప‌ద్ధ‌తిలో నాలుగు ఎక‌రాల భూమిని దోచుకున్నార‌నే కేసు రేవంత్ త‌ల‌పై వేలాడుతోంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘ‌ట‌న తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క అంశంగా మారింది. విష‌యంలోకివెళ్తే.. రేవంత్ రెడ్డి, అతడి సోదరుడితో కలిసి తప్పుడు డాక్యుమెంట్ల ద్వారా అత్యంత ఖరీదు చేసే భూమిని తమ పేరు మీద రాయించుకున్నట్టు ప్ర‌భుత్వం గుర్తించింది.

శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలో అత్యంత ఖరీదు చేసే దాదాపు ఐదెకరాల భూమిని అక్రమ మార్గంలో దక్కించుకున్నట్లు ఆధారాలతో సహా బయట‌పెట్టింది. గోపనపల్లిలోని సర్వే నెంబరు 127లో గల 10.21 ఎకరాల భూమికి సంబంధించి తప్పుడు డాక్యుమెంట్ల ద్వారా క్రయ విక్రయాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో కొందరు కోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం విచారణ జరిపింది.

ఈ విచారణలో తప్పుడు మార్గాల ద్వారా, తప్పుడు డాక్యుమెంట్ల ద్వారా మొదట వేరే వారి పేరు మీద భూమి రాయించి, తర్వాత వారి నుంచి తాము కొనుగోలు చేసినట్లు రేవంత్ రెడ్డి, అతడి సోదరుడు కాగితాలు రాసుకున్నారు. ఎంపీ రేవంత్ రెడ్డి, అతని సోదరుడు కొండల్ రెడ్డి అక్రమంగా, తప్పుడు డాక్యుమెంట్ల ద్వారా 4 ఎకరాల 39 గుంటలను తమ పేరు మీద రాయించుకున్నట్లు తేలింది. ఈ నివేదికను రంగారెడ్డి జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపినట్లు తెలిసింది.

అక్రమ డాక్యుమెంట్లను ఆధారం చేసుకుని మ్యుటేషన్ చేసిన అధికారులపైన, తప్పుడు మార్గంలో భూమిని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించిన వారిపైనా చర్య తీసుకోవడానికి ప్రభుత్వం ఉపక్రమించినట్లు సమాచారం. ఈ క్ర‌మంలో రాజ‌కీయ వైరం కూడా ఉన్న రేవంత్ రెడ్డిని కేసీఆర్ బ‌లంగా టార్గెట్ చేస్తార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version