సాగర్ లో కేసీఆర్ ఒక్క ప్రచారమే కాదు…!

-

తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఓడిపోతే సీఎం కేసీఆర్ కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అయితే భారతీయ జనతా పార్టీ గెలిస్తే మాత్రం కొన్ని ఇబ్బందులు సీఎం కేసీఆర్ కు వ్యక్తిగతంగా వచ్చే అవకాశం ఉండవచ్చు. ఉప ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మంచి విజయాలు సాధించింది. కాబట్టి నాగార్జునసాగర్ లో కూడా గెలిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ నుంచి సీఎం కేసీఆర్ ఇబ్బందులు ఎదుర్కోవచ్చు.

సీఎం కేసీఆర్

అందుకే ఇప్పుడు సీఎం కేసీఆర్ కూడా కొన్ని అంశాలు దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి విజయం సాధించిన సరే నాగార్జునసాగర్ ఎన్నికల్లో జానారెడ్డిని ఎదుర్కొని విజయం సాధించడం కష్టం అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయితే జానారెడ్డిని ఎదుర్కొనే విషయంలో సీఎం కేసీఆర్ దూకుడుగా ముందుకు వెళ్లవచ్చు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

సీఎం కేసీఆర్ ఈ నెల 14న ప్రచారం చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే ఈ లోపు ఆయన నాగార్జునసాగర్ పర్యటనకు వచ్చే అవకాశాలున్నాయని నాగార్జునసాగర్ లో పార్టీ నేతలతో ఆయన మాట్లాడే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. ఒక ప్రచారమే కాకుండా నేతల మధ్య సమన్వయం చేయడమే కాకుండా మంత్రులకు కూడా దిశానిర్దేశం చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందనేది రాబోయే రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news