ఈ విషయంలో కెసిఆర్ గ్రేట్…!

-

దేశ వ్యాప్తంగా జరుగుతున్న పౌరసత్వ సవరణ చట్టం ఆందోళనలు అన్ని చోట్లా హింసా రూపం దాల్చాయి అనేది వాస్తవ౦. దేశ రాజధాని ఢిల్లీ నుంచి బెంగళూరు చెన్నై వరకు కూడా ఆందోళనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే హింస కూడా ఎక్కువగానే జరుగుతుంది. ఈ నేపధ్యంలోనే ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన విధ్వంశం లో చాలా మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు.

నరకం చూస్తున్నారు కూడా. అయితే తెలంగాణా లో మాత్రం ఇవి ఎక్కడా హింసకు దారి తీయలేదు. ఇక్కడ అన్ని పార్టీలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. దేశంలో మైనార్టీ లు ఎక్కువగా ఉన్న నగరం హైదరాబాద్. అయినా సరే ఎక్కడా సరే ఆందోళనలు అనేవి హింసకు వెళ్ళడం లేదు హైదరాబాద్ లో. తాజాగా మరోసారి హైదరాబాద్ లో ఆందోళన జరిగింది. అయినా సరే ప్రజలు ఎక్కడా కూడా రేచ్చిపోలేదు. వాళ్ళను ఎవరూ రెచ్చగొట్టలేదు.

ప్రశాంతంగా ఆందోళన జరిగింది. కాని భారీగా జరిగింది. ఈ విషయంలో తెలంగాణా ప్రభుత్వం మాత్రం నిజం గా గ్రేట్ అంటున్నారు. కెసిఆర్ బిజెపికి దూరంగా ఉంటూ మజ్లీస్ పార్టీ తో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అలాగే అమలు చేసేది లేదని స్పష్టంగా చెప్పారు. దాని గురించి ఎవరైనా మాట్లాడినా సరే కెసిఆర్ కంట్రోల్ చేస్తున్నారు. తాను కూడా వ్యతిరేకంగా ఉన్నా కాబట్టి కలిసి పోరాటం చేద్దాం. అంతే గాని ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు అనే సిద్దాంతంలో కెసిఆర్ ఉన్నారు. అందుకే ఈ విషయంలో గ్రేట్ కెసిఆర్.

Read more RELATED
Recommended to you

Latest news