నేడు క‌మ‌ల్ హాస‌న్ తో సీఎం కేసీఆర్ భేటీ

తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ త‌మిళ‌నాడు టూర్ బిజీ బిజీ గా న‌డుస్తుంది. ఇప్ప‌టి కే త‌మిళ‌నాడు ముఖ్య మంత్రి ఎం కే స్టాలిన్ తో తెలంగాణ‌ సీఎం కేసీఆర్ స‌మావేశం అయ్యారు. నేడు త‌మిళ‌నాడు లోని మ‌క్క‌ల్ నీదిమ‌యం అధినేత, ప్ర‌ముఖ సినీ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ తో స‌మావేశం కానున్నారు. కాగ సీఎం కేసీఆర్ త‌మిళ‌నాడు లో వ‌రుస భేటీ లో రాజ‌కీయం గా ఆస‌క్తి రేపుతున్నాయి.

ఇప్ప‌టికే త‌మిళ‌నాడు ముఖ్య మంత్రి స్టాలిన్ తో జ‌రిగిన స‌మావేశంలో రాష్ట్రాల పై కేంద్ర ప్ర‌భుత్వం తీరు, వ‌రి ధాన్యం పై చ‌ర్చించిన‌ట్టు తెలుస్తుంది. అలాగే జాతీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ ల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పై కూడా చ‌ర్చించిన‌ట్టు తెలుస్తుంది. తాజా గా క‌మ‌ల్ హాస‌న్ తో స‌మావేశం తో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు సంబంధించి సీఎం కేసీఆర్ కీలక అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తుంది. కాగ త‌మిళనాడు సీఎం స్టాలిన్, సినీ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ఇద్ద‌రూ కూడా కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకం గా త‌మ గొంతు వినిపించిన వారే కావ‌డం విశేషం.