నాకు హోమ్ స్టేట్ తమిళనాడులో గెలవాలని ఉంది : బన్నీ

స్టైలిష్ స్టార్ బన్నీ తాజాగా నటించిన సినిమా పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో పుష్ప రాజ్ గా నటించాడు. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మండన నటించింది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ మరి పాటలు విడుదల కాగా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమల్లో బిజీ అయ్యింది. ఈ నేథ్యంలోనే అల్లు అర్జున్ చెన్నై లో ప్రమోషన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ…నా సినిమాలు హిందీ లో డబ్ అయ్యి హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కానీ నాకు మాత్రం హోమ్ స్టేట్ తమిళనాడులో గెలవాలని ఉంది. పుష్ప సినిమా పాటల వల్ల కోలీవుడ్ ప్రేక్షకులకు భాగా దగ్గరైంది. కోలీవుడ్ లో కమల్ హాసన్, ధనుష్, శింబు, విజయ్ లు భాగా డ్యాన్స్ చేస్తారు. అంటూ వ్యాఖ్యానించారు.