త్వరలో తెలంగాణా రైతులకు గుడ్ న్యూస్: కేసీఆర్

-

కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం అనంతరం తెలంగాణా సిఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. త్వరలోనే తాను తెలంగాణా రైతులకు గుడ్ న్యూస్ చెప్తా అని దేశం మొత్తం ఆశ్చర్యపోయే న్యూస్ చెప్తా అని అన్నారు. అదే విధంగా మరిన్ని కీలక వ్యాఖ్యలు చేసారు ఆయన. రిజర్వాయర్‌లోకి గోదావరి నీళ్లు చేరాయని చెప్పుకొచ్చారు.

ప్రాజెక్ట్ నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడిన ఆయన నిర్వాసితుల త్యాగం వల్ల లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిందని పేర్కొన్నారు. భూ నిర్వాసితులకు సిద్దిపేట ఎస్‌ఈజడ్‌లో ఉద్యోగాలు ఇస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఏ ప్రభుత్వం కూడా పూర్తి చేయలేని విధంగా తాము పూర్తి చేసామని కేసీఆర్ అన్నారు. అదే విధంగా తెలంగాణా సాగునీటి ప్రాజెక్ట్ ల ద్వారా ప్రతీ ఎకరాకి నీరు అందిస్తామని పేర్కొన్నారు.

భూ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేసారు. ఎన్నో విమర్శలకు ఈ ప్రాజెక్ట్ ఫలితం అని అన్నారు. తెలంగాణలో మల్లన్నసాగర్‌ రెండో అతిపెద్ద ప్రాజెక్టన్న ఆయన… 53లక్షల టన్నుల ధాన్యాన్ని కేంద్రానికి తెలంగాణ ఇచ్చిందని.. రాష్ట్రం పసిడి పంటల తెలంగాణగా మారిందని పేర్కొన్నారు. ఇంజినీరింగ్‌ అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టని, తెలంగాణ ఇంజినీర్ల ప్రతిభకు నిదర్శనం అన్నారు ఆయన.

లక్ష కోట్ల పంటను తెలంగాణా రైతులు ఏడాది కాలంలో పండించారని నియంత్రిత పంటలను రైతులు సక్సెస్ చెయ్యాలని అన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎందరికో సాగునీరు తాగు నీరు అందిస్తున్నామని చెప్పారు. భూ సేకరణ లో రెవెన్యు అధికారులు బాగా పని చేసారు అని కేసీఆర్ ఈ సందర్భంగా కొనియాడారు. 4 వేల మెగా వాట్ల విద్యుత్ ఈ ప్రాజెక్ట్ కి అవసరం అని కేసీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news