గతకొన్ని రోజులుగా చిరంజీవి నేతృత్వంలో టాలీవుడ్ పెద్దలు అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడం, అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్ తో చర్చించడం తెలిసిందే! ఇదే క్రమంలో తాజాగా తెలుగు సినిమా నిర్మాతల మండలి ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఒక లేఖ కూడా రాశారు! ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన అనంతరం ఏపీ సీఎం జగన్ ను కూడా చిరంజీవి కాంటాక్టు చేశారంట! ఈ విషయంలో చిరు విన్నపానికి జగన్ సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది!
ఈ క్రమంలో చిరు విన్నపానికి పాజిటివ్ గా స్పందించిన జగన్… అవకాశంతో తో బాధ్యత కూడా ఇచ్చారని తెలుస్తోంది! టాలీవుడ్ సమస్యల మీద చర్చించేందుకు ఎప్పుడైనా రావొచ్చని చిరంజీవి బృందానికి జగన్ నుంచి పిలుపు అందినట్లు తెలుస్తున్న తరుణంలో… వచ్చే ముందు మాత్రం టాలీవుడ్ ఏపీ ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తోంది, అదేవిధంగా ఏపీలో సినిమా రంగ పరిశ్రమ అభివృద్దికి ప్రభుత్వం ఏం చేయాలని ఇండస్ట్రీ ఆశిస్తోంది వంటి విషయాలపై క్లియర్ ప్లాన్ తో రావాలని జగన్ తెలిపారంట. గతంలో కేంద్రంలో టూరిజం మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న చిరంజీవి… సినిమా పరిశ్రమను విశాఖలో డెవలప్ చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను దృష్టిలో పెట్టుకుని అందుకు అవసరమైన ప్లాన్ కూడా ఏదైనా ఉంటే తీసుకురావాలని సూచించారట!
ఈ క్రమంలో అన్నీ అనుకూలంగా జరిగితే జూన్ తొలి లేదా రెండోవారంలో జగన్ అపాయింట్ మెంట్ తీసుకుని చిరు అండ్ కో అమరావతికి పయనం అఅయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది! ఆ సంగతులు అలా ఉంటే… కేసీఆర్ ను కలిసే విషయంలో తనను ఎవడూ పిలవలేదు అని ఫైరవుతున్న బాలయ్యను ఈ మీటింగ్ కు చిరు & కో పిలుస్తారా? పిలిస్తే బాలయ్య జగన్ వద్దకు వెళ్తారా? అన్నది ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద చర్చ!