టీఆర్ఎస్ నేతలకు కెసిఆర్ వార్నింగ్…!

-

తెలంగాణలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పుడు చాలా ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా వైరస్ ని పూర్తిగా తరిమికొట్టే వరకు ఎవరూ కూడా అలసత్వం ప్రదర్శించవద్దని అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, వైరస్ ని అడ్డుకోవడానికి అందుకు అవసరమైతే ఎన్ని నిధులు కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని కాబట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది అనే ఆదేశాలను కేసీఆర్ ఇచ్చారు. ఇది పక్కన పెడితే తాజాగా కొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే గారు అమెరికాలో నెలరోజులపాటు తిరిగి వచ్చి ఆయన పలు కార్యక్రమాల్లో క్వారంటైన్ లో లేకుండా పాల్గొన్నారు. దీనితో ఆయన ఎక్కడెక్కడ తిరిగారు ఆయన ఎక్కడెక్కడ ప్రయాణించారు అనేదానిమీద ఇప్పుడు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇలాగే నిజామాబాద్ జిల్లాకు చెందిన కొందరు స్థానిక సంస్థల ప్రతినిధులు హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా వాళ్ళందరూ మందేసి చిందేసారు. ఈ విషయం తెలిసిన కేసీఆర్ ఇప్పుడు వాళ్ళందర్నీ అర్జెంట్ గా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా హైదరాబాదులో ఉండవద్దని స్పష్టంగా ఆదేశించారట.

ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా సరే పదవులు పోతాయి అని హెచ్చరిక కూడా కేసీఆర్ చేసినట్లు సమాచారం. అధికారులు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే రాష్ట్రంలోకి అనుమతించాలని కెసిఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. కొందరు మంత్రులను ఎప్పటికప్పుడు జిల్లాల్లో పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news