సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో కేసీఆర్ మీటింగ్ …. శివసేన కీలక నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు

-

దేశంలో ప్రత్యామ్నాయ కూటమికి రంగం సిద్ధం అవతున్న రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి. తాజాగా నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. బీజేపీ సర్కార్ ను కూకటి వెళ్లతో పెకిలించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో పరివర్తన రావాలని.. కొత్తగా రాజ్యాంగ మార్పలు రావాలంటూ వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై పోరాడటానికి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.

రెండు మూడు రోజుల్లో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలుస్తానంటూ… కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై శివసేన కీలక నేత ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. దేశంలో ప్రత్యామ్నాయ కూటమికి కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నామని…2024లో బీజేపీపై పోటీ చేసేందుకు ప్రత్యేక కూటమి కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ నుంచి మధ్యతరగతి వారు, పేదలు ఏం పొందారని ప్రశ్నించారు సంజయ్ రౌత్. జుమ్లా, గోల్‌మాల్, టైమ్ పాస్ బడ్జెట్ గా విమర్శించారు. ఇది ఫ్లాప్ సినిమా అంటూ బడ్జెట్ ను అభివర్ణించారు సంజయ్ రౌత్.

Read more RELATED
Recommended to you

Latest news