ఆ న‌లుగురు మంత్రుల‌కు జ‌గ‌న్ క్లాస్‌..!

-

రాష్ట్రంలో అధికారం చేప‌ట్టినప్ప‌టి నుంచి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ పాల‌న‌లో త‌న మార్క్ చూపుతున్నారు. ప్ర‌జా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూనే…ప‌లు సంస్క‌ర‌ణ‌ల‌కు బాట‌లు వేస్తున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో అవినీతిని స‌హించేది లేద‌ని, అన్ని వ‌ర్గాల నుంచి ఆద‌రాభిమానాలు ద‌క్కేలా వ్య‌వ హ‌రించాల‌ని సీఎం ఇప్ప‌టికే మంత్రుల‌కు దిశానిర్దేశం చేశారు. అయితే కేబినెట్‌లో కొంద‌రు మంత్రులు జ‌గ‌న్ను అంత సీరియ‌స్ తీసుకోవ‌డంలేద‌ని తెలుస్తోంది.

Thullur in Guntur district likely to be new capital of AP
Thullur in Guntur district likely to be new capital of AP

త‌న సూచ‌న‌ల‌ను ప‌ట్టించుకోని కొందరు నాయ‌కులు, మంత్రుల ప‌ట్ల జ‌గ‌న్ కూడా కొంత క‌ఠిన వైఖ‌రి అవ‌లంభిస్తున్న‌ట్లు స‌మాచారం. ప‌లువురు మంత్రుల‌కు వైఎస్ జ‌గ‌న్ క్లాస్ తీసుకునే ప‌రిస్థితి త లెత్తుతోంది. తాజాగా నిర్వ‌హించిన నాలుగో ద‌ఫా మంత్రి వ‌ర్గ భేటీలో వైఎస్ జ‌గ‌న్ తన మంత్రుల్లో కొంద‌రికి చుర‌క‌లు అంటించారు. అన్నా అన్నా అంటూనే కొందరు మంత్రుల‌కు.. అమ్మా.. అమ్మా అంటూనే మ‌హిళా మంత్రుల‌కు త‌న‌దైన స్టైల్‌లో క్లాస్ ఇచ్చినట్లు తెలిసింది.

ప్ర‌ధానంగా పినిపే విశ్వ‌రూప్‌, పాముల పుష్ప‌శ్రీవాణి, తానేటి వ‌నిత‌, శంక‌ర నారాయ‌ణ‌ల‌కు వైఎస్ జ‌గ‌న్ కొన్ని సూచ‌న‌లు చేసిన‌ట్టు తెలిసింది. మ‌రి వీరు ఇక‌నైనా త‌మ ప‌ద్ధ‌తిని మార్చుకుంటారో లేదో వేచి చూ డాల్సిందే. నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలోనూ వైఎస్ జ‌గ‌న్ మంత్రుల‌కే సుతిమెత్త‌గా వార్నింగ్ ఇచ్చిన ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కేవ‌లం ప్ర‌తిభ ఆధారంగా ఎవ‌రికి ఏ ప‌ద‌వి ఇవ్వాలో తానే నిర్ణ‌యి స్తాన‌ని.. ఈ విష‌యంలో మంత్రులు ఎవ్వ‌రూ త‌న‌పై ఒత్తిడి తీసుకురావొద్ద‌ని తేల్చి చెప్పిన‌ట్టు తెలిసింది.

ఎట్టి ప‌రిస్థితిలోనూ పైర‌వీల‌కు తావులేద‌ని, ప్ర‌తిభ, మార్కుల ఆధారంగానే రాష్ట్రంలో ఉద్యోగ ని యామకాలు చేప‌ట్టాల‌ని వైఎస్ జ‌గ‌న్ ఆదేశించారు. ఇదే స‌మ‌యంలో ప‌లువురు మంత్రుల‌ను ఆయ‌న సున్నితంగా మంద‌లించారు. అన‌వ‌స‌రంగా త‌మ ప‌రిధిలోని లేని విష‌యాల‌పై ఎందుకు దృష్టి పెడుతున్నారు. మీకు ఈ విష‌యాల‌కు సంబంధం లేదుక‌దా..? మీ మీ శాఖ‌ల పురోగ‌తిని మాత్ర‌మే మీరు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని వైఎస్ జ‌గ‌న్ మంత్రుల‌కు క్లాస్ ఇచ్చిన‌ట్లు పార్టీలో గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news