చంద్రబాబు అవసరానికి వాడుకోవడం అనంతరం విసిరేయడం అనే విషయంలో నిత్యం బలయ్యే పార్టీ ఏమైనా ఉందంటే అది కచితంగా కమ్యునిస్టు పార్టీలనే చెప్పాలి. ఈ విషయంలో మహా కూటమి అన్నా.. జనసేన కూటమి అన్నా.. మద్యలో బలిపశువులు అయ్యేది మాత్రం కమ్యునిస్టులే! అయితే ఈ సారి కమ్యునిస్టులు అలా మారిపోవాలని అనుకోవడం లేదంట.. పక్కాగా ప్రణాళికలు వేసుకుని జగన్ తో కలవాలని చూస్తున్నారంట!
అవును.. నమ్మడానికి కాస్త అనుమానంగా ఉన్నా కూడా ఇది నిజం అని అంటున్నారు విశ్లేషకులు. తాజాగా సీపీఐ సంగతి కాసేపు పక్కనపెడితే.. సీపీఎం మాత్రం జగన్ తో దోస్తీకి పావులు కదుపుతుందని, వారికి జగన్ అంటే నమ్మకం అని, ఇక సీపీఎం మధు అంటే జగన్ కు చాలా గౌరవం అని అంటున్నారు! అందుకే ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇంటికి వెళ్లి మరీ పలకరించారు!! ఇదే సమయంలో అచ్చెన్న అవినీతి కేసు బయటపడటానికి కూడా సీపీఎం మధే కారణం అని అంటుంటారు!
ఈ రేంజ్లో అభిప్రాయాలు, అభిరుచులు కలవడంతో… ఈ రెండు పార్టీలు కలవకపోవడానికి గల బలమైన కారణం ఏమిటనేది చర్చ! దీంతో ఒక్కసారిగా ఈ విషయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది! ఫలితంగా… ప్రస్తుతానికి అధికారికంగా కాకపోయినా.. అనధికారికంగా సీపీఎం – వైకాపాలు దోస్తీ చేయబోతున్నాయని అంటున్నారు!! ఇదే జరిగితే బాబుకు మరో బలమైన దెబ్బతగిలినట్లే అనేది బలమైన వాదన! అటు బీజేపీతోనూ కాక, ఇటు కమ్యునిస్టులూ వదిలేస్తే… బాబు భవిష్యత్తు ఇక 2019 ఎన్నికల ఫలితాల మాదిరే అనే కామెంట్లు తాజాగా వినిపించడం ఈ సందర్భంగా కొసమెరుపు!!