గ్రేటర్ ఎన్నికలు: ఒంటరిగానే పోటీ, మా ప్రత్యర్ధి తెరాస కాదు: బండి సంజయ్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. గ్రేటర్ ఎన్నికల్లో పొత్తు కోసం తాము ఎవరిని సంప్రదించలేదు అని తమను కూడా ఎవరూ సంప్రదించలేదు అని ఆయన పేర్కొన్నారు. రేపటి బిజెపి ఎలక్షన్ కమిటీ భేటీలో తాము అభ్యర్ధులను ప్రకటిస్తామని ఆయన అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో తాము ఒంటరి గా పోటీ చేస్తున్నామని స్పష్టత ఇచ్చారు.

గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి ప్రచార బాధ్యతలను ముందు ఉండి నడిపిస్తామని ఆయన అన్నారు. ఎన్నికల్లో మజ్లీస్ పార్టీ తమ ప్రధాన ప్రత్యర్ధి అని ఆయన స్పష్టత ఇచ్చారు. ఇక గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు అందరూ కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో బిజెపి పోటీ చేసే విషయానికి సంబంధించి చాలా చర్చలు జరిగాయి. జనసేన పొత్తు ఉండే అవకాశం ఉందని భావించారు.