సోము వీర్రాజుపై బిజెపి అధిష్టానానికి ఫిర్యాదులు…?

ఆంధ్రప్రదేశ్ లో కొన్ని కొన్ని విషయాల్లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తప్పులు చేస్తున్నారు. ప్రధానంగా కొంత మందిని ఆయన ప్రోత్సహించడం లేదని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా సోము వీర్రాజు పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నారు అనే అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కార్యకర్తల బలం అనేది భారతీయ జనతా పార్టీకి లేదు.

అందుకే జనసేన పార్టీ మీద ఆధారపడాల్సిన పరిస్థితి భారతీయ జనతా పార్టీకి ఏర్పడింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు చాలామందికి ప్రజాదరణ కనపడటం లేదు. కాబట్టి ప్రజాదరణ ఉన్న నాయకులను ముందుకు తీసుకు రావాల్సిన అవసరం ఉంటుంది. అయితే వీరరాజు తనకు అనుకూలంగా ఉండే వారితో మాత్రం ఎక్కువగా మాట్లాడటం ఇప్పుడు ఇబ్బందికరంగా మారిన అంశం.

సోము వీర్రాజు విషయంలో ఫిర్యాదులు చేయడానికి కొంత మంది బీజేపీ నేతలు ఢిల్లీ వెళుతున్నట్లు గా సమాచారం. సోము వీర్రాజు తమను కలిసే అవకాశం ఇవ్వటం లేదు అని దీని వలన పార్టీలో సమస్యలను తాము అధిష్టానం దృష్టికి తీసుకురాలేకపోతున్నానని కొంతమంది నేతలు ఇబ్బందికరంగా ఉన్నారని సమాచారం. సోము వీర్రాజుపై ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లడానికి కామినేని శ్రీనివాస్ అలాగే విష్ణుకుమార్ రాజు సహా కొంతమంది బీజేపీ నేతలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేస్తారట.